గ్రీన్ స్టేటస్ చూపెట్టు ఫ్లైట్ ఎక్కు: కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ : కరోనాను ట్రాక్ చేసే మొబైల్ యాప్ ‘ఆరోగ్య సేతు’ గ్రీన్ స్టేటస్‌ను చూపిస్తే విమాన ప్రయాణికులకు క్వారంటైన్ అవసరం లేదని కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. లాక్‌డౌన్ కాలంలో దేశీయంగా విమాన సేవలను తిరిగి ప్రారంభించడం, అందుకు సంబంధించిన మార్గదర్శకాల వివరాలను ఆయన శనివారం ఆన్‌లైన్‌లో చర్చించారు. దేశీయంగా విమానయానం చేసిన ప్రయాణికుల స్థితి ఆరోగ్యసేతు యాప్‌లో గ్రీన్ స్టేటస్‌గా కనిపిస్తే వారిని కరోనా క్వారంటైన్‌కు పంపాల్సిన అవసరం […]

Update: 2020-05-23 05:22 GMT

న్యూఢిల్లీ : కరోనాను ట్రాక్ చేసే మొబైల్ యాప్ ‘ఆరోగ్య సేతు’ గ్రీన్ స్టేటస్‌ను చూపిస్తే విమాన ప్రయాణికులకు క్వారంటైన్ అవసరం లేదని కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. లాక్‌డౌన్ కాలంలో దేశీయంగా విమాన సేవలను తిరిగి ప్రారంభించడం, అందుకు సంబంధించిన మార్గదర్శకాల వివరాలను ఆయన శనివారం ఆన్‌లైన్‌లో చర్చించారు. దేశీయంగా విమానయానం చేసిన ప్రయాణికుల స్థితి ఆరోగ్యసేతు యాప్‌లో గ్రీన్ స్టేటస్‌గా కనిపిస్తే వారిని కరోనా క్వారంటైన్‌కు పంపాల్సిన అవసరం లేదని చెప్పారు. అంతేకాదు, త్వరలోనే స్వల్ప సంఖ్యలో అంతర్జాతీయ విమానాల సేవలను ప్రారంభించబోతున్నట్టు వివరించారు. ఆయన గురువారం కూడా ఇదే తరహా స్టేట్‌మెంట్ విడుదల చేశారు. దాని తర్వాతే కేరళ, కర్ణాటక, అసోంలాంటి కనీసం ఆరు రాష్ట్రాలు ప్రయాణికులను కచ్చితంగాక్వారంటైన్‌లోకి పంపాలని కేంద్రాన్ని అభ్యర్థించాయి. ఈ చర్చపై స్పందిస్తూ అనవసరంగా ఈ అంశాన్ని లేవదీస్తున్నాయని విమర్శిస్తూ విపక్షాలపై మండిపడ్డారు. ఇవి కూడా దేశీయంగా జరిగే రాకపోకలే.. ట్రైన్, బస్సుల్లో ఎటువంటి నిబంధనలు ఉన్నాయో అవే వర్తిస్తాయని చెప్పారు. కరోనా పాజిటివ్‌గా ఉన్నవారిని ప్రయాణానికి అనుమతించబోమని తెలిపారు.

Tags:    

Similar News