ఆన్‌లైన్‌లోనే సభలు.. సమావేశాలు

దిశ, హైదరాబాద్: కరోనా వైరస్ కారణంగా ప్రపంచం అల్లకల్లోలం అయిపోతోంది. అనేక కష్టాలను తెచ్చిపెట్టింది. పనిలో పనిగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా వినియోగించుకోవాలో కూడా అలవాటు చేస్తోంది. రాష్ట్రంలోని ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్(ఇండియా) ప్రధాన కార్యాలయం ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్ వేదికగా సభలు, సమావేశాలను ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తోంది. వందేళ్ళ చరిత్ర కలిగిన ఈ సంస్థ ఆధ్వర్యంలో నేటి సమాజానికి అవసరమైన ఇంజనీరింగ్ సేవలను ఎలా వినియోగించాలనే వేర్వేరు అంశాలపై నిరంతరం చర్చలు, సమావేశాలు, సభలు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం […]

Update: 2020-04-23 09:10 GMT

దిశ, హైదరాబాద్: కరోనా వైరస్ కారణంగా ప్రపంచం అల్లకల్లోలం అయిపోతోంది. అనేక కష్టాలను తెచ్చిపెట్టింది. పనిలో పనిగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా వినియోగించుకోవాలో కూడా అలవాటు చేస్తోంది. రాష్ట్రంలోని ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్(ఇండియా) ప్రధాన కార్యాలయం ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్ వేదికగా సభలు, సమావేశాలను ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తోంది. వందేళ్ళ చరిత్ర కలిగిన ఈ సంస్థ ఆధ్వర్యంలో నేటి సమాజానికి అవసరమైన ఇంజనీరింగ్ సేవలను ఎలా వినియోగించాలనే వేర్వేరు అంశాలపై నిరంతరం చర్చలు, సమావేశాలు, సభలు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం లాక్‌డౌన్ నేపథ్యంలో పెద్ద ఎత్తున సామూహిక సమావేశాలకు అవకాశం లేనందున ఆన్‌లైన్‌లోనే సభలు, సమావేశాలను ఆన్ లైన్ ద్వారానే నిర్వహించాలని భావించారు ఐఈఐ తెలంగాణ చాప్టర్ చైర్మన్ డాక్టర్ జి.రామేశ్వర్ రావు. దీంతో జూమ్ క్లౌడ్ మీటింగ్ యాప్ ద్వారా గత రెండ్రోజులుగా వరుస సమావేశాలను నిర్వహస్తున్నారు.

అందులో భాగంగా వరల్డ్ ఎర్త్ డేను పురస్కరించుకొని ఈ నెల 22న కోవిడ్ -19 అండ్ మెసర్స్ టు కంటెయిన్ ఇట్ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా హైదరాబాద్ స్పైన్ క్లినిక్స్ సినియర్ కన్సల్స్టెంట్ అండ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్. భక్తియార్ చౌదరి వ్యవహరించారు. ఈ నెల 23న ఇంజనీర్ కోకా కృష్ణ మోహన్ రావు 30వ స్మారకోపన్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోడ్డు, భవనాల శాఖ మాజీ చీఫ్ ఇంజనీర్ డీవీ భావన రావు హజరయ్యారు. ఈ సందర్భంగా ఐఈఐ చాప్టర్ చైర్మన్ డాక్టర్ జి.రామేశ్వర్ రావు మాట్లాడుతూ లాక్ డౌన్ అమల్లో ఉన్నందున రెగ్యులర్ కార్యక్రమాలను వాయిదా వేయకుండా, నిర్వహించాలనేదే సంస్థ ఉద్దేశ అన్నారు. జూమ్ క్లౌడ్ మీటింగ్ లకు దాదాపు వంద మందికి పైగా ఇంజనీర్లు హాజరయ్యారు.

Tags: Corona Effect, Zoom Meeting, IEI Khairatabad, Dr. G. Rameshwar Rao

Tags:    

Similar News