మోకిల ఎల్లమ్మ తల్లి దేవాలయాలపై హెలికాప్టర్‌తో పూల వర్షం
దిశ, శంకర్ పల్లి : ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన అలవరచుకోవాలని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాల యాదయ్య పేర్కొన్నారు. శంకర్పల్లి మండలం మోకిల గ్రామంలో ఆదివారం టీఆర్ఎస్ నాయకుడు మన్నె లింగం ముదిరాజ్ సొంత డబ్బులతో ఎల్లమ్మ పోచమ్మ దేవాలయాలు నిర్మించి అమ్మ వారి విగ్రహాలను ప్రతిష్టించారు. హెలికాప్టర్ ద్వారా అమ్మవారి విగ్రహాలు పై పూలవర్షం కురిపించారు. బోనాలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే […]
దిశ, శంకర్ పల్లి : ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన అలవరచుకోవాలని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాల యాదయ్య పేర్కొన్నారు. శంకర్పల్లి మండలం మోకిల గ్రామంలో ఆదివారం టీఆర్ఎస్ నాయకుడు మన్నె లింగం ముదిరాజ్ సొంత డబ్బులతో ఎల్లమ్మ పోచమ్మ దేవాలయాలు నిర్మించి అమ్మ వారి విగ్రహాలను ప్రతిష్టించారు. హెలికాప్టర్ ద్వారా అమ్మవారి విగ్రహాలు పై పూలవర్షం కురిపించారు. బోనాలతో ఊరేగింపు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాల యాదయ్యలు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ నాయకుడు మన్నె లింగం ముదిరాజ్ ఎంతో ఆధ్యాత్మిక చింతనతో దేవాలయాలను నిర్మించడం అభినందనీయమని పేర్కొన్నారు. అదేవిధంగా ఎక్కడా లేనివిధంగా గ్రామంలో హెలికాప్టర్‌తో పూల వర్షం కురిపించే విధంగా ఏర్పాటు చేయడం ఎంతో అద్భుతం అని పేర్కొన్నారు. బోనాల ఊరేగింపు పలువురిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కావలి గోపాల్, వర్కింగ్ ప్రెసిడెంట్ గోవర్ధన్ రెడ్డి, కౌన్సిలర్ శ్రీనాథ్ గౌడ్, పొద్దుటూరు మాజీ సర్పంచ్ చంద్రమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.