‘కాపీ’నే ఓ ట్రెండ్
దిశ, వెబ్‌డెస్క్: డిజిటల్ ఎరాలో.. క్రియేటివిటీ ఉన్నోడే కింగ్ అంటారు కానీ, ఆ క్రియేటివిటీని అందంగా కాపీ చేసి దానికి సింపుల్‌గా ‘ట్రెండ్’ అనే పేరు పెట్టేస్తారు. సోషల్ మీడియా ప్రపంచంలో అనేక బ్రాండ్స్.. నెటిజన్లను ఆకట్టుకునేందుకు ప్రధానంగా ‘క్రియేటివ్ టెంప్లేట్స్’ను ఉపయోగిస్తుంటాయి. ఈ క్రమంలో తమ బ్రాండ్ క్లయింట్ కోసం, ఏదేని ఏజెన్సీకి చెందిన క్రియేటర్స్.. ఎంతో కష్టపడి టెంప్లేట్స్‌ను రూపొందిస్తుంటారు. అయితే పలు బ్రాండ్స్ మాత్రం.. ఇలాంటి టెంప్లేట్స్ నుంచి స్ఫూర్తి పొందడం మాని, […]
దిశ, వెబ్‌డెస్క్: డిజిటల్ ఎరాలో.. క్రియేటివిటీ ఉన్నోడే కింగ్ అంటారు కానీ, ఆ క్రియేటివిటీని అందంగా కాపీ చేసి దానికి సింపుల్‌గా ‘ట్రెండ్’ అనే పేరు పెట్టేస్తారు. సోషల్ మీడియా ప్రపంచంలో అనేక బ్రాండ్స్.. నెటిజన్లను ఆకట్టుకునేందుకు ప్రధానంగా ‘క్రియేటివ్ టెంప్లేట్స్’ను ఉపయోగిస్తుంటాయి. ఈ క్రమంలో తమ బ్రాండ్ క్లయింట్ కోసం, ఏదేని ఏజెన్సీకి చెందిన క్రియేటర్స్.. ఎంతో కష్టపడి టెంప్లేట్స్‌ను రూపొందిస్తుంటారు. అయితే పలు బ్రాండ్స్ మాత్రం.. ఇలాంటి టెంప్లేట్స్ నుంచి స్ఫూర్తి పొందడం మాని, యథావిధిగా కాపీ కొడుతుంటాయి. కేవలం తమ బ్రాండ్ నేమ్, లోగో చేంజ్ చేసి.. దాన్నొక ట్రెండ్‌గా మార్చేస్తుంటాయి. ఈ క్రమంలో ప్రతీది కాపీకీ కాపీగా మారిపోయింది. ఉదాహరణకు స్నాప్‌చాట్ స్టోరీస్, ట్విట్టర్ స్టోరీస్, ఇన్‌స్టా స్టోరీస్, ఫేస్‌బుక్ స్టోరీస్.
అడ్వర్టైజ్‌మెంట్ బిజినెస్ రన్ అయ్యేది ఐడియాలతోనే. ట్రెండ్‌కు తగ్గ ఆలోచనలు లేకపోతే, అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీలు మనుగడ సాగించలేవు. నిజానికి ‘ఐడియా డూప్లికేషన్’ అనేది కరెక్ట్ కాదు. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని.. ఏజెన్సీలు తమ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘిస్తూ కొన్నేళ్లుగా ఇతర బ్రాండ్ల ఆలోచనలను కాపీ చేస్తున్నాయి. ట్రెండ్ పేరుతో ఒరిజినల్ ఐడియాను వాడుకుని, కన్జ్యూమర్ అటెన్షన్‌ను డ్రా చేస్తున్నాయి.
ఒక బ్రాండ్.. పాపులర్ అయ్యేందుకు ఒరిజినల్ ఆలోచన నుంచి కేవలం ప్రేరణ పొందామని కొందరు వాదించొచ్చు. కానీ అదే ఫార్మాట్.. మరొక బ్రాండ్ ప్రాచుర్యం పొందటానికి, వైరల్‌గా మారడానికి సహాయపడొచ్చు. ఆ ఐడియా కోసం ఎంతో కష్టపడ్డ క్రియేటర్ మాత్రం.. ‘హే, అది నా ఆలోచన’ అంటూ ఆ పోస్ట్‌పై కామెంట్ చేయడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. ఆ కామెంట్ అలా ఉండగానే.. తెల్లారేసరికల్లా ఇంకో ‘ఒరిజినల్ ఐడియా’ కాపీ అయిపోవడమే కాకుండా, క్రియేటర్‌కు క్రెడిట్ లేకుండా మరొక పోస్ట్ అప్‌లోడ్ అవుతుంది. అది కూడా వైరల్ అయ్యే అవకాశముంది. ఇలా ఒరిజినల్ ఐడియాలు కాపీ కావడాన్ని గమనించిన ‘స్కాబ్యాంగ్’ అనే డిజిటల్ ఏజెన్సీ.. ‘అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీ’కి ఇటీవలే ఓ ఓపెన్ లెటర్ రాసింది. ‘ట్రెండింగ్ ఫార్మాట్స్ కిల్ చేయడానికి ఇదే సరైన సమయం. వేలకొద్దీ కంటెంట్ క్రియేటర్స్ ఐడియాలను కాపీ చేస్తున్నారు. రోజురోజుకు మనం మన యూనిక్ వాయిస్‌ను కోల్పోతున్నాం. కన్జ్యూమర్లను ఆకట్టుకోవడంలో విఫలమవుతున్నాం’ అని లేఖలో పేర్కొంది. కానీ ఇంతవరకు ఆ దిశగా చర్యలు మొదలుకాలేదు.
ఇటీవలే అమెజాన్ తమ సోషల్ మీడియా ఖాతాల్లో ‘మి’ లోగోతో పాటు మిస్సింగ్ ‘మి’, వేర్ ఈజ్ ‘మి’ అంటూ అడ్వర్జైట్ చేశాయి. అది కాస్త వైరల్ కావడంతో ‘డుంజో, పెప్సీ, ప్లార్లే జీ, టిండర్ ఇండియా’లు ఈ ట్రెండ్‌ను కొనసాగిస్తూ.. తమ బ్రాండ్స్ నుంచి అక్షరాలను డిలీట్ చేసి ట్రెండ్‌ను కొనసాగించాయి. అయితే అమెజాన్‌కు ముందు శాంసంగ్ తమ గెలాక్సీ ఎఫ్41 లాంచింగ్ నేపథ్యంలో.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘ఎఫ్’ను తీసేసి ప్రచారం చేసింది. దాంతో విపరీతమైన ప్రచారం లభించగా, అది శాంసంగ్ మార్కెటింగ్‌లో భాగమని ఆ తర్వాత తెలిసింది.
ఇకనైనా కాపీలు చేయకుండా, కస్టమర్‌ను సంతృప్తిపరిచే ఒరిజినల్ ఐడియాలు వస్తే మార్కెట్‌కు మరింత బాగుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.