ఐడీసీయంఎస్ మేనేజర్ పై చర్యలు తీసుకోవాలి: నర్సయ్య
దిశ, నిజామాబాద్: ది ఇందూర్ డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ మార్కేటింగ్ సొసైటీ, నిజామాబాద్ లో మేనేజర్ గా పనిచేస్తున్న రమేష్ అక్రమాలకు పాల్పడ్డారని, అతనిపై చర్యలు తీసకోవాలని సొసైటీ ఉద్యోగుల తరుపున జూనియర్ అసిస్టెంట్ డి. నర్సయ్య డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆయన సోమవారం జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడారు. గతంలో కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెప్పి ఒక్కొక్కరి నుంచి రమేష్ రూ.1.50 లక్షలు […]
దిశ, నిజామాబాద్: ది ఇందూర్ డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ మార్కేటింగ్ సొసైటీ, నిజామాబాద్ లో మేనేజర్ గా పనిచేస్తున్న రమేష్ అక్రమాలకు పాల్పడ్డారని, అతనిపై చర్యలు తీసకోవాలని సొసైటీ ఉద్యోగుల తరుపున జూనియర్ అసిస్టెంట్ డి. నర్సయ్య డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆయన సోమవారం జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడారు. గతంలో కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెప్పి ఒక్కొక్కరి నుంచి రమేష్ రూ.1.50 లక్షలు వసూలు చేశాడని, నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ షాపింగ్ కాంప్లెక్స్ లలో అద్దెకు ఉన్నవారి వద్ద అగ్రిమెంట్ చేయుటకు రూ.1 లక్ష వరకు డబ్బులు తీసుకుని అద్దె రేటు తక్కువ చేశాడన్నారు. హాస్టల్ కు చెందిన నిత్యావసర సరుకులను కొనుగోలు చేసి రూ. 7 లక్షల నష్టం తెచ్చడాని ఆయన అన్నారు. సొంత బావమరిదిని క్యాషియర్ గా నియమించుకుని సొసైటీలో అక్రమాలకు పాల్పడ్డాడని, అతడిపై చర్యలు తీసుకోవాలన్నారు.