‘ఐడా’ తుఫాన్ ఎఫెక్ట్.. 67 మంది మృతి

దిశ, వెబ్‌డెస్క్ : అమెరికాలో ఐడా తుఫాన్ విరుచుకపడుతోంది. న్యూయార్క్ నగరంలో ఐడా తుఫాన్ సృష్టిస్తున్న బీభత్సానికి చరిత్రలో ఎన్నడూ లేనంతగా భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో న్యూయార్క్ ప్రధాన వీధులన్నీ నదులను తలపిస్తున్నాయి. ఈ తుఫాన్ కారణంగా గురువారం ఒక్క రాత్రే 44 మంది మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. న్యూ జెర్సీలోనూ సుమారు 23 మంది మరణించినట్టు గవర్నర్ ఫిల్ మర్ఫీ వెల్లడించారు. దీంతో పాటే పలు ముఖ్య నగరాల్లో టోర్నెడోలు పెను విధ్వంసం […]

Update: 2021-09-02 22:54 GMT

దిశ, వెబ్‌డెస్క్ : అమెరికాలో ఐడా తుఫాన్ విరుచుకపడుతోంది. న్యూయార్క్ నగరంలో ఐడా తుఫాన్ సృష్టిస్తున్న బీభత్సానికి చరిత్రలో ఎన్నడూ లేనంతగా భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో న్యూయార్క్ ప్రధాన వీధులన్నీ నదులను తలపిస్తున్నాయి. ఈ తుఫాన్ కారణంగా గురువారం ఒక్క రాత్రే 44 మంది మృతి చెందినట్టు అధికారులు తెలిపారు.

న్యూ జెర్సీలోనూ సుమారు 23 మంది మరణించినట్టు గవర్నర్ ఫిల్ మర్ఫీ వెల్లడించారు. దీంతో పాటే పలు ముఖ్య నగరాల్లో టోర్నెడోలు పెను విధ్వంసం సృష్టిస్తున్నాయి. చాలా మంది ఇళ్ళను కోల్పోయి నిరాశ్రయులైనట్టు తెలుస్తోంది. బలంగా గాలులు వీస్తుండటంతో విద్యుత్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలు, వరదల కారణంగా విమాన, మెట్రో సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News