ఏ వేరియంట్‌కైనా కొవాగ్జినే బెస్ట్: ఐసీఎంఆర్
దిశ, వెబ్‌డెస్క్: భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్‌కి సంబంధించి ఐసీఎంఆర్ కీలక ప్రకటన చేసింది. కరోనా వైరస్‌కు చెందిన ఏ వేరియంట్‌కైనా కోవాగ్జిన్‌నే మందు అని తెలిపింది. సార్స్ కోవ్2 వైరస్‌కు చెందిన యూకే వేరియంట్(B.1.1.7), బ్రెజిల్ వేరియంట్(B.1.1.28), సౌతాఫ్రికా(B.1.351)ను కోవాగ్జిన్ కట్టడి చేస్తుందని ఐసీఎంఆర్ తెలిపింది. డబుల్ మ్యుటెంట్ స్ట్రెయిన్లనూ కోవాగ్జిన్ నాశనం చేస్తుందని ఐసీఎంఆర్ తెలిపింది. అటు కోవాగ్జిన్ సమర్థత 78 శాతంగా వెల్లడించిన భారత్ బయోటెక్.. సీరియస్ కేసుల్లో 100 […]
దిశ, వెబ్‌డెస్క్: భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్‌కి సంబంధించి ఐసీఎంఆర్ కీలక ప్రకటన చేసింది. కరోనా వైరస్‌కు చెందిన ఏ వేరియంట్‌కైనా కోవాగ్జిన్‌నే మందు అని తెలిపింది. సార్స్ కోవ్2 వైరస్‌కు చెందిన యూకే వేరియంట్(B.1.1.7), బ్రెజిల్ వేరియంట్(B.1.1.28), సౌతాఫ్రికా(B.1.351)ను కోవాగ్జిన్ కట్టడి చేస్తుందని ఐసీఎంఆర్ తెలిపింది.
డబుల్ మ్యుటెంట్ స్ట్రెయిన్లనూ కోవాగ్జిన్ నాశనం చేస్తుందని ఐసీఎంఆర్ తెలిపింది. అటు కోవాగ్జిన్ సమర్థత 78 శాతంగా వెల్లడించిన భారత్ బయోటెక్.. సీరియస్ కేసుల్లో 100 శాతం సమర్థవంతంగా పనిచేస్తోందని తెలిపింది.