మహిళల టీ20 మ్యాచ్ కు బ్రేక్..

మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో ఇవాళ ఇండియా, ఇంగ్లాండ్‌ల మధ్య జరుగనున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌ను వరుణుడు అడ్డుకున్నాడు. సిడ్నీలో భారీ వర్షం కురుస్తుండటంతో ఇంకా టాస్ కూడా వేయకుండానే వర్షం మొదలయ్యింది. వర్షం వచ్చే సూచనలు ఉన్నాయని ముందే ఊహించిన విధంగానే వర్షం అడ్డంకిగా మారింది. ఇప్పట్లో ఆ వర్షం తగ్గే సూచనలు కన్పించడం లేదని స్థానిక సమాచారం. కనీసం 10 ఓవర్లు మ్యాచ్‌ జరిగే పరిస్థితి లేదని తెలుస్తోంది. వర్షం తగ్గితే వెంటనే మ్యాచ్ జరిపేందుకు […]

Update: 2020-03-04 23:11 GMT

మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో ఇవాళ ఇండియా, ఇంగ్లాండ్‌ల మధ్య జరుగనున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌ను వరుణుడు అడ్డుకున్నాడు. సిడ్నీలో భారీ వర్షం కురుస్తుండటంతో ఇంకా టాస్ కూడా వేయకుండానే వర్షం మొదలయ్యింది. వర్షం వచ్చే సూచనలు ఉన్నాయని ముందే ఊహించిన విధంగానే వర్షం అడ్డంకిగా మారింది. ఇప్పట్లో ఆ వర్షం తగ్గే సూచనలు కన్పించడం లేదని స్థానిక సమాచారం. కనీసం 10 ఓవర్లు మ్యాచ్‌ జరిగే పరిస్థితి లేదని తెలుస్తోంది. వర్షం తగ్గితే వెంటనే మ్యాచ్ జరిపేందుకు నిర్వాహకులు సిద్ధంగా ఉన్నారు. రిజర్వ్‌ డే లేకపోవడంతో మ్యాచ్‌ను ఎట్టిపరిస్థితుల్లోనే ఈరోజే నిర్వహించాలి. ఒకవేళ మ్యాచ్‌ రద్దయితే భారత్‌ నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండటంతో భారత్‌కు ఫైనల్‌ ఛాన్స్‌ దక్కుతుంది. మొదటి మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన రెండో సెమీస్‌ రద్దయితే సఫారి టీమ్‌ ఫైనల్‌కు వెళుతుంది. గ్రూప్‌ ‘బి’లో దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో నిలిచింది. సెమీస్, ఫైనల్‌ మ్యాచ్‌లకు రిజర్వ్‌ డే పెడితే టోర్నీ వ్యవధి మరింత పెరుగుతుందని, ఇది అనవసరపు ఇబ్బందికి దారి తీస్తుందని కూడా ఐసీసీ వెల్లడించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం వర్షం పడితే పిచ్, మైదానం పరిస్థితులను బట్టి రిఫరీ నిర్ణయం తీసుకుంటారు.

Tags: ICC Women T20 World Cup, First Semi Final, rain, match tai, india, england

Tags:    

Similar News