ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్.. రిషబ్ పంత్

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు జనవరి నెలకు గాను రిషబ్ పంత్‌కు ప్రకటించింది. ఆస్ట్రేలియాలో టీమ్ ఇండియా టెస్టు సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన పంత్ కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. మూడో టెస్టులో 97 పరుగులు, గబ్బా టెస్టులో 89 పరుగులు చేశాడు. గబ్బా విజయంలో ప్రధాన పాత్ర రిషబ్ పంత్‌దే. ఐసీసీ ఈ […]

Update: 2021-02-08 05:03 GMT

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు జనవరి నెలకు గాను రిషబ్ పంత్‌కు ప్రకటించింది. ఆస్ట్రేలియాలో టీమ్ ఇండియా టెస్టు సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన పంత్ కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. మూడో టెస్టులో 97 పరుగులు, గబ్బా టెస్టులో 89 పరుగులు చేశాడు. గబ్బా విజయంలో ప్రధాన పాత్ర రిషబ్ పంత్‌దే. ఐసీసీ ఈ అవార్డుకు జనవరి నెలకు గానూ పంత్‌తో పాటు జో రూట్, పాల్ స్టిర్లింగ్‌లను నామినేట్ చేసింది.

అయితే అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న పంత్‌నే అవార్డు వరించింది. ‘ఈ నెలలో గుర్తుంచుకోవల్సింది పంత్, టీమ్ ఇండియానే. ఆవార్డు ప్రవేశపెట్టిన తర్వాత తొలి అవార్డును పంత్ గెలుచుకున్నాడు. అభినందనలు’ అని ఐసీసీ ట్వీట్ చేసింది. సౌత్ఆఫ్రికాకు చెందిన షభ్నిం ఇస్మాయేల్ మహిళ క్రికెట్‌లో ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెల్చుకుంది.

Tags:    

Similar News