ఇంగ్లాండ్-శ్రీలంక మ్యాచ్ రిఫరీకి కరోనా
దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న పరిమిత ఓవర్ల సిరీస్‌లో కరోనా కలకలం సృష్టించింది. బయోబబుల్ వాతావరణంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రిఫరీగా వ్యవహరిస్తున్న ఫిల్ విట్టికేస్ కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యాడు. టాస్ వేయడానికి అతడు ఇంగ్లాండ్, శ్రీలంక కెప్టెన్లలతో కలసి ఆయన పిచ్ వద్దకు వెళ్లారు. శనివారం జరిగిన ఈ మ్యాచ్ అనంతరం కరోనా పరీక్షలు నిర్వహించగా ఫిల్ విట్టికేస్ పాజిటివ్‌గా తేలాడు. రిఫరీకి ఎలాంటి కరోనా లక్షణాలు లేవని ఈసీబీ ప్రకటించింది. […]
దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న పరిమిత ఓవర్ల సిరీస్‌లో కరోనా కలకలం సృష్టించింది. బయోబబుల్ వాతావరణంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రిఫరీగా వ్యవహరిస్తున్న ఫిల్ విట్టికేస్ కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యాడు. టాస్ వేయడానికి అతడు ఇంగ్లాండ్, శ్రీలంక కెప్టెన్లలతో కలసి ఆయన పిచ్ వద్దకు వెళ్లారు. శనివారం జరిగిన ఈ మ్యాచ్ అనంతరం కరోనా పరీక్షలు నిర్వహించగా ఫిల్ విట్టికేస్ పాజిటివ్‌గా తేలాడు. రిఫరీకి ఎలాంటి కరోనా లక్షణాలు లేవని ఈసీబీ ప్రకటించింది. అంతే కాకుండా ఆటగాళ్లందరూ సురక్షితంగానే ఉన్నారని ఈసీబీ చెప్పింది. రిఫరీ ఫిల్ 10 రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో గడపనున్నారని.. అతడిని ఈసీబీ వైద్య బృందాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయని ఈసీబీ పేర్కొన్నది. కాగా, ఫిల్ విట్టికేస్‌తో సన్నిహితంగా ఉన్న ఇతర అధికారులు, ఐసీసీ అవినీతి నిరోధక యూనిట్ సభ్యులు ఏడుగురిని కూడా 10 రోజుల క్వారంటైన్‌కు పంపారు.