ఇంటర్నేషనల్ క్రికెట్‌లో కొత్త పాలసీ

దిశ, స్పోర్ట్స్ : అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు ఆడాలంటే ఇకపై వయసు నిబంధన కచ్చితంగా పాటించాలని ఐసీసీ ప్రకటించింది. ఏ క్రికెటర్‌కి అయినా 15 ఏళ్లు నిండితేనే అంతర్జాతీయ క్రికెట్ ఆడటానికి ఐసీసీ అనుమతి ఇవ్వనుంది. 15 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న క్రికెటర్‌తో అంతర్జాతీయ మ్యాచ్ ఆడించాలంటే సదరు దేశం తప్పని సరిగా ఐసీసీకి దరఖాస్తు చేసుకోవాలి. ఆ క్రికెటర్‌ను ఐసీసీ పరీక్షించి.. అతడికి సరైన ఫిట్‌నెస్, మానసికస్థైర్యం ఉన్నట్లు భావిస్తేనే ఐసీసీ అతడికి […]

Update: 2020-11-20 08:54 GMT

దిశ, స్పోర్ట్స్ : అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు ఆడాలంటే ఇకపై వయసు నిబంధన కచ్చితంగా పాటించాలని ఐసీసీ ప్రకటించింది. ఏ క్రికెటర్‌కి అయినా 15 ఏళ్లు నిండితేనే అంతర్జాతీయ క్రికెట్ ఆడటానికి ఐసీసీ అనుమతి ఇవ్వనుంది. 15 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న క్రికెటర్‌తో అంతర్జాతీయ మ్యాచ్ ఆడించాలంటే సదరు దేశం తప్పని సరిగా ఐసీసీకి దరఖాస్తు చేసుకోవాలి. ఆ క్రికెటర్‌ను ఐసీసీ పరీక్షించి.. అతడికి సరైన ఫిట్‌నెస్, మానసికస్థైర్యం ఉన్నట్లు భావిస్తేనే ఐసీసీ అతడికి అనుమతించనున్నది. ఈ నిబంధన అన్ని ఐసీసీ ఈవెంట్లు, ద్వైపాక్షిక సిరీస్‌లు, అండర్ 19 క్రికెట్‌కు వర్తించనున్నది. మహిళ, పురుష క్రికెటర్లకు ఈ నిబంధన అమలు చేస్తామని ఐసీసీ స్పష్టం చేసింది. గతంలో పాకిస్తాన్ క్రికెటర్ హసన్ రజా 14 ఏల్ల 227 రోజులకు అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. సచిన్ మాత్రం 16 ఏళ్ల 205 రోజుల వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.

Tags:    

Similar News