అర్హత టోర్నీలు వాయిదా వేసిన ఐసీసీ
కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే ఒలింపిక్స్ వంటి మెగా ఈవెంట్ వాయిదా పడగా.. ఐపీఎల్ వాయిదా విషయం సందిగ్ధంలో ఉంది. యూరో కప్, ఫ్రెంచ్ ఓపెన్ వంటి టోర్నీలు సైతం షెడ్యూల్ మార్చుకున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ కూడా వరల్డ్ కప్ అర్హత టోర్నీలను వాయిదా వేసింది. 2021లో జరగనున్న టీ20 ప్రపంచకప్, 2023లో జరిగే వన్డే ప్రపంచ కప్ కోసం పోటీ పడే జట్లకు ఈ ఏడాది జూన్ 30లోపు అర్హత పోటీలు నిర్వహించాల్సి ఉంది. […]
కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే ఒలింపిక్స్ వంటి మెగా ఈవెంట్ వాయిదా పడగా.. ఐపీఎల్ వాయిదా విషయం సందిగ్ధంలో ఉంది. యూరో కప్, ఫ్రెంచ్ ఓపెన్ వంటి టోర్నీలు సైతం షెడ్యూల్ మార్చుకున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ కూడా వరల్డ్ కప్ అర్హత టోర్నీలను వాయిదా వేసింది. 2021లో జరగనున్న టీ20 ప్రపంచకప్, 2023లో జరిగే వన్డే ప్రపంచ కప్ కోసం పోటీ పడే జట్లకు ఈ ఏడాది జూన్ 30లోపు అర్హత పోటీలు నిర్వహించాల్సి ఉంది. కాగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆ టోర్నీలను వాయిదా వేస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. దీంతో పాటు 2021 మహిళా వన్డే ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ పోటీలు శ్రీలంకలో జరగాల్సి ఉండగా.. ఆ షెడ్యూల్‌లోనూ మార్పులు చేయాలని ఐసీసీ భావిస్తోంది.
Tags: IPL, ICC, BCCI, WT20, Qualifying matches, Olympics