వరల్డ్ కప్‌పై రేపు నిర్ణయం?
దిశ, స్పోర్ట్స్: టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై సోమవారం జరిగే సమావేశంలో ఐసీసీ నిర్ణయం తీసుకోనుంది. శశాంక్ మనోహర్ చైర్మన్ పదవి నుంచి దిగిపోయిన తర్వాత తొలిసారిగా సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించనున్నారు. తాత్కాలిక అధ్యక్షుడు ఇమ్రాన్ ఖవాజా నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. టీ20 వరల్డ్ కప్ నిర్వహణే ఈ సమావేశం అజెండాలోని ముఖ్యాంశం కానుంది. ఈ ఏడాది అక్టోబర్ 18నుంచి నవంబర్ 15వరకు ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్ నిర్వహించాల్సి ఉంది. […]
దిశ, స్పోర్ట్స్: టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై సోమవారం జరిగే సమావేశంలో ఐసీసీ నిర్ణయం తీసుకోనుంది. శశాంక్ మనోహర్ చైర్మన్ పదవి నుంచి దిగిపోయిన తర్వాత తొలిసారిగా సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించనున్నారు. తాత్కాలిక అధ్యక్షుడు ఇమ్రాన్ ఖవాజా నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. టీ20 వరల్డ్ కప్ నిర్వహణే ఈ సమావేశం అజెండాలోని ముఖ్యాంశం కానుంది. ఈ ఏడాది అక్టోబర్ 18నుంచి నవంబర్ 15వరకు ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్ నిర్వహించాల్సి ఉంది. కానీ, ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఈ మెగా టోర్నీ నిర్వహించలేమని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చేతులెత్తేసింది. అయితే, ఐసీసీ మాత్రం ఇంతవరకు దీనిపై నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు ఐసీసీ వాయిదా నిర్ణయం తీసుకుంటే ఐపీఎల్‌కు మార్గం సుగమనం అవుతుందని బీసీసీఐ భావిస్తున్నది.