బైజూస్ చేతికి ఐసీసీ గ్లోబల్ హక్కులు
దిశ, స్పోర్ట్స్ : ఇండియాలో అతిపెద్ద ఎడ్యూటెక్ సంస్థ బైజూస్‌ను ఐసీసీ గ్లోబర్ పార్టనర్‌గా నియమించింది. 2021 నుంచి 2023 వరకు ఐసీసీ ఈవెంట్స్‌కు సంబంధించిన పలు హక్కులు బైజూస్ దక్కించుకున్నది. మూడేళ్ల పాటు ఈ ఒప్పందం అమలులో ఉంటుంది. ఈ కాలంలో ఐసీసీ ఇండియాలో నిర్వహించే పురుషుల టీ20 వరల్డ్ కప్, న్యూజీలాండ్‌లో జరిగే మహిళల వన్డే వరల్డ్ కప్‌తో పాటు ఐసీసీ నిర్వహించే అన్ని ఈవెంట్లకు సంబంధించి ఇన్-వెన్యూ, బ్రాడ్‌కాస్ట్, డిజిటల్ హక్కులు బైజూస్ […]
దిశ, స్పోర్ట్స్ : ఇండియాలో అతిపెద్ద ఎడ్యూటెక్ సంస్థ బైజూస్‌ను ఐసీసీ గ్లోబర్ పార్టనర్‌గా నియమించింది. 2021 నుంచి 2023 వరకు ఐసీసీ ఈవెంట్స్‌కు సంబంధించిన పలు హక్కులు బైజూస్ దక్కించుకున్నది. మూడేళ్ల పాటు ఈ ఒప్పందం అమలులో ఉంటుంది. ఈ కాలంలో ఐసీసీ ఇండియాలో నిర్వహించే పురుషుల టీ20 వరల్డ్ కప్, న్యూజీలాండ్‌లో జరిగే మహిళల వన్డే వరల్డ్ కప్‌తో పాటు ఐసీసీ నిర్వహించే అన్ని ఈవెంట్లకు సంబంధించి ఇన్-వెన్యూ, బ్రాడ్‌కాస్ట్, డిజిటల్ హక్కులు బైజూస్ దక్కించుకుంది. వినూత్నమైన కార్యక్రమాలు రూపొందించి ఐసీసీకి ప్రచారం చేయడం కూడా బైజూస్ బాధ్యతల్లో ఒకటి. ‘మేము బైజూస్‌తో జట్టు కట్టాము. ఆ సంస్థ మాతో కలసి పని చేయడం చాలా సంతోషంగా ఉన్నది. మాది ఒక గ్రేట్ ఇన్నింగ్స్‌గా మారుతుందని భావిస్తున్నాము’ అని ఐసీసీ సీఈవో మను సాహ్నీ అన్నారు. కాగా, బైజూస్ ప్రస్తుతం టీమ్ ఇండియాకు జెర్సీ పార్ట్‌నర్‌గా ఉన్నది.