ఐసీసీ అవార్డుల నామినేషన్లు..
దిశ, స్పోర్ట్స్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పదేళ్లకు ఒకసారి ఇచ్చే దశాబ్ది అత్యుత్తమ ఆటగాళ్ల అవార్డుల నామినేషన్లను మంగళవారం ప్రకటించింది. ఈ దశాబ్దంలోనే అత్యుత్తమ క్రికెటర్ అవార్డుల నామినేషన్లలో ఇద్దరు భారత క్రికెటర్లు ఉండటం గమనార్హం. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది డెకేడ్ కోసం మొత్తం ఏడుగురిని నామినేట్ చేయగా వారిలో కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు. వీరితో పాటు జో రూట్ (ఇంగ్లాండ్), కేన్ విలియమ్‌సన్ (న్యూజీలాండ్), స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా), ఏబీ డివిలియర్స్ […]
దిశ, స్పోర్ట్స్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పదేళ్లకు ఒకసారి ఇచ్చే దశాబ్ది అత్యుత్తమ ఆటగాళ్ల అవార్డుల నామినేషన్లను మంగళవారం ప్రకటించింది. ఈ దశాబ్దంలోనే అత్యుత్తమ క్రికెటర్ అవార్డుల నామినేషన్లలో ఇద్దరు భారత క్రికెటర్లు ఉండటం గమనార్హం. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది డెకేడ్ కోసం మొత్తం ఏడుగురిని నామినేట్ చేయగా వారిలో కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు. వీరితో పాటు జో రూట్ (ఇంగ్లాండ్), కేన్ విలియమ్‌సన్ (న్యూజీలాండ్), స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా), ఏబీ డివిలియర్స్ (సౌత్ ఆఫ్రికా), కుమార సంగక్కర (శ్రీలంక) కూడా ఉన్నారు. వీటితో పాటు మరి కొన్ని కేటగిరీల నామినేషన్లు కూడా ఐసీసీ ప్రకటించింది. ఆయా క్రికెటర్లకు లభించే వోట్లను బట్టి విజేతను ప్రకటిస్తామని ఐసీసీ చెప్పింది.
ఐసీసీ మహిళల ప్లేయర్ ఆఫ్ ది డెకేడ్:
మిథాలి రాజ్ (ఇండియా) ఎల్లీస్ పెర్రీ (ఆస్ట్రేలియా), మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా), సూజీ బేట్స్ (న్యూజీలాండ్), స్టెఫానీ టేలర్ (వెస్టిండీస్), సారా టేలర్ (ఇంగ్లాండ్)
ఐసీసీ పురుషుల వన్డే ప్లేయర్ ఆఫ్ ది డెకేడ్:
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని, లసిత్ మలింగ (శ్రీలంక), మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా), డి విలియర్స్ (సౌత్ ఆఫ్రికా), సంగక్కర (శ్రీలంక)
ఐసీసీ పురుషుల టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది డెకేడ్:
విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్‌సన్ (న్యూజీలాండ్), జో రూట్ (ఇంగ్లాండ్), స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా), జేమ్స్ అండర్సన్ (ఇంగ్లాండ్), రంగన హెరాత్ (శ్రీలంక), యాసిర్ షా (పాకిస్తాన్)
ఐసీసీ పురుషుల టీ20 ప్లేయర్ ఆఫ్ ది డెకేడ్:
రషీద్ ఖాన్ (ఆఫ్ఘనిస్తాన్), కోహ్లీ (ఇండియా), ఇమ్రాన్ తాహిర్ (సౌత్ ఆఫ్రికా), ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా), లసిత్ మలింగ (శ్రీలంక), క్రిస్ గేల్ (వెస్టిండీస్), రోహిత్ శర్మ (ఇండియా)
ఐసీసీ మహిళల టీ20 ప్లేయర్ ఆఫ్ ది డెకేడ్ :
మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా), సోఫీ డివైన్ (న్యూజీలాండ్), ఎల్లీస్ పెర్రీ (ఆస్ట్రేలియా), దియాంద్ర డాటిన్ (వెస్టిండీస్), అలీసా హేలీ (ఆస్ట్రేలియా), అన్య షర్బ్‌సోల్ (ఇంగ్లాండ్)
ఐసీసీ మహిళల వన్డే ప్లేయర్ ఆఫ్ ది డెకేడ్ :
మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా), మిథాలి రాజ్ (ఇండియా), సుజీ బేట్స్ (న్యూజీలాండ్), స్టెఫానీ టేలర్ (వెస్టిండీస్), ఝులన్ గోస్వామి (ఇండియా), ఎల్లీస్ పెర్రీ (ఆస్ట్రేలియా),
ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డ్ ఆఫ్ ది డెకేడ్ :
విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్ సన్ (న్యూజీలాండ్), బ్రెండన్ మెక్‌కల్లమ్ (న్యూజీలాండ్), మిస్బా-ఉల్-హక్ (పాకిస్తాన్), ఎంఎస్ ధోని, అన్య షర్బ్‌సోల్ (ఇంగ్లాండ్), కేథరిన్ బ్రంట్ (ఇంగ్లాండ్), మహేళ జయవర్దనే (శ్రీలంక), డేనియల్ వెటోరి (న్యూజీలాండ్)