రాహుల్ రెండు, కోహ్లీ పది

ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో కేఎల్ రాహుల్ 823 రేటింగ్స్‌తో రెండో ర్యాంకులో కొనసాగుతున్నాడు. పాక్ ఆటగాడు బాబర్ అజామ్ 879 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో నిలిచాడు. విరాట్ కోహ్లీ తొమ్మిదో ర్యాంకు నుంచి పదో ర్యాంకుకు పడిపోయాడు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 11 స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో ఆకట్టుకున్న ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కోహ్లీ, రోహిత్ శర్మను వెనక్కి నెట్టి తొమ్మిదో స్థానానికి ఎగబాకాడు. అల్‌రౌండర్ విభాగంలో మహ్మద్ నబీ […]

Update: 2020-02-17 20:29 GMT

ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో కేఎల్ రాహుల్ 823 రేటింగ్స్‌తో రెండో ర్యాంకులో కొనసాగుతున్నాడు. పాక్ ఆటగాడు బాబర్ అజామ్ 879 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో నిలిచాడు. విరాట్ కోహ్లీ తొమ్మిదో ర్యాంకు నుంచి పదో ర్యాంకుకు పడిపోయాడు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 11 స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో ఆకట్టుకున్న ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కోహ్లీ, రోహిత్ శర్మను వెనక్కి నెట్టి తొమ్మిదో స్థానానికి ఎగబాకాడు. అల్‌రౌండర్ విభాగంలో మహ్మద్ నబీ ఫస్ట్ ఫ్లేస్‌లో నిలిచాడు. ఇక బౌలింగ్ విభాగంలో ఆఫ్ఘాన్ సంచలనం రషీద్ ఖాన్ టాప్ ప్లేస్‌లో ఉన్నాడు.

Tags:    

Similar News