T20 వరల్డ్ కప్ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..

దిశ, వెబ్‌డెస్క్ : అక్టోబర్ 17 నుంచి జరిగే టీ20 వరల్డ్ కప్‌‌కు సంబంధించిన ప్రైజ్ మనీని ఐసీసీ ప్రకటించింది. ప్రపంచకప్ గెలిచిన జట్టుకు రూ.12కోట్లు, రన్నరప్‌కు రూ. 6కోట్లు ఇవ్వనున్నట్టు తెలిపింది. సెమీ ఫైనల్స్‌ వరకు వచ్చి ఓడిపోయిన జట్టుకు రూ.3కోట్ల చొప్పున ఇస్తామని వెల్లడించింది. అదే విధంగా సూపర్ 12 స్టేజ్ లో గెలిచిన ప్రతీ జట్టుకు రూ.30లక్షల చొప్పున అందిస్తామని తెలిపింది. ఇదిలాఉండగా, 2021 అక్టోబర్ 17న ప్రారంభమయ్యే ప్రపంచ కప్ టోర్నీలు […]

Update: 2021-10-10 11:53 GMT
T20 వరల్డ్ కప్ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్ : అక్టోబర్ 17 నుంచి జరిగే టీ20 వరల్డ్ కప్‌‌కు సంబంధించిన ప్రైజ్ మనీని ఐసీసీ ప్రకటించింది. ప్రపంచకప్ గెలిచిన జట్టుకు రూ.12కోట్లు, రన్నరప్‌కు రూ. 6కోట్లు ఇవ్వనున్నట్టు తెలిపింది. సెమీ ఫైనల్స్‌ వరకు వచ్చి ఓడిపోయిన జట్టుకు రూ.3కోట్ల చొప్పున ఇస్తామని వెల్లడించింది. అదే విధంగా సూపర్ 12 స్టేజ్ లో గెలిచిన ప్రతీ జట్టుకు రూ.30లక్షల చొప్పున అందిస్తామని తెలిపింది. ఇదిలాఉండగా, 2021 అక్టోబర్ 17న ప్రారంభమయ్యే ప్రపంచ కప్ టోర్నీలు నవంబర్ 14 వరకు జరగుతుందని ICC స్పష్టంచేసింది.

Tags:    

Similar News