దిశ, ఆత్మకూరు(ఎం) : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన కూనూరు సమీపంలో చోటు చేసుకుంది. ఆత్మకూరు గ్రామానికి చెందిన కొండ శ్రీకాంత్ (27) కూనూరు వద్ద ఆటో మీద పడి మృతి చెందినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. మృతుని భౌతికకాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంక్రాంతి పండుగ నాడు అందరితో కలిసి మెలసి ఉన్న శ్రీకాంత్ బుధవారం మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.