జీఎస్టీ వార్షిక రిటర్న్ ఫైలింగ్‌కు గడువు కోరిన ఐసీఏఐ

దిశ, వెబ్‌డెస్క్: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) 2018-19 జీఎస్టీ వార్షిక రిటర్న్ ఫైలింగ్ గడువును పొడిగించాలని కోరుతూ జీఎస్టీ కౌన్సిల్‌ (GST Council)కు లేఖ రాసింది. డిసెంబర్ 31 వరకు 3 నెలల వరకు వాయిదా వేయాలని ఐసీఏఐ (ICAI) కోరింది. కరోనా ప్రభావంతో మెజారిటీ కార్యాలయాలు మాత్రమే పనిచేస్తున్నాయని ఐసీఏఐ వివరించింది. ప్రస్తుతం పన్ను చెల్లింపుదారుల కోసం వార్షిక రిటర్నులను దాఖలు చేసేందుకు సెప్టెంబర్ 30 వరకు గడువు ఉంది. […]

Update: 2020-09-13 08:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) 2018-19 జీఎస్టీ వార్షిక రిటర్న్ ఫైలింగ్ గడువును పొడిగించాలని కోరుతూ జీఎస్టీ కౌన్సిల్‌ (GST Council)కు లేఖ రాసింది. డిసెంబర్ 31 వరకు 3 నెలల వరకు వాయిదా వేయాలని ఐసీఏఐ (ICAI) కోరింది. కరోనా ప్రభావంతో మెజారిటీ కార్యాలయాలు మాత్రమే పనిచేస్తున్నాయని ఐసీఏఐ వివరించింది.

ప్రస్తుతం పన్ను చెల్లింపుదారుల కోసం వార్షిక రిటర్నులను దాఖలు చేసేందుకు సెప్టెంబర్ 30 వరకు గడువు ఉంది. కరోనా నుంచి ఉత్పన్నమయ్యే పరిస్థితులను అధిగమించి జీఎస్టీ ఆడిట్ దాఖలు చేసేందుకు తగినంత సమయం కావాలని, రిజిస్టర్డ్ వ్యక్తులకు ఈ పొడిగింపు కావాలని ఐసీఏఐ లేఖలో పేర్కొంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి వార్షిక జీఎస్టీ రిటర్నులను (GST returns)దాఖలు చేయడానికి చివరి తేదీని ప్రభుత్వం మేలో మూడు నెలల వరకు పొడిగించింది.

Tags:    

Similar News