ఐపీఎల్‌కు అది లేదు : గంగూలీ
దిశ, స్పోర్ట్స్: ఈ ఏడాది యూఏఈలో నిర్వహించనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతుందని బీసీసీఐ (BCCI) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ధీమా వ్యక్తం చేశారు. బీసీసీఐ అధికారులు ప్రస్తుతం దుబాయ్‌లో ఉండి ఐపీఎల్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండగా.. గంగూలీ మాత్రం కోల్‌కతా నుంచి వారిని నడిపిస్తున్నారు. కాగా, కోల్‌కతాలో జరిగిన ఒక యాడ్ షూట్‌లో పాల్గొన్న గంగూలీ ఐపీఎల్‌పై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ ఉన్న పరిస్థితిపై తాను […]
దిశ, స్పోర్ట్స్: ఈ ఏడాది యూఏఈలో నిర్వహించనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతుందని బీసీసీఐ (BCCI) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ధీమా వ్యక్తం చేశారు. బీసీసీఐ అధికారులు ప్రస్తుతం దుబాయ్‌లో ఉండి ఐపీఎల్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండగా.. గంగూలీ మాత్రం కోల్‌కతా నుంచి వారిని నడిపిస్తున్నారు.
కాగా, కోల్‌కతాలో జరిగిన ఒక యాడ్ షూట్‌లో పాల్గొన్న గంగూలీ ఐపీఎల్‌పై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ ఉన్న పరిస్థితిపై తాను వ్యాఖ్యానించలేను. గత షెడ్యూల్ ప్రకారమే ఐపీఎల్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్ చాలా కాలం జరగాల్సి ఉంది. ఇది తప్పకుండా విజయవంతం అవుతుంది’ అని గంగూలీ అన్నాడు. ప్రస్తుతం ప్రపంచమంతా ఈ సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నది. ఫుట్‌బాల్, క్రికెట్ మ్యాచ్‌లు కూడా ఖాళీ స్టేడియంలలో జరుగుతున్నాయి. కాబట్టి ఈ వాస్తవాన్ని గ్రహించి.. ఆటగాళ్లు కూడా జాగ్రత్తగా ఉండటం మంచిదని గంగూలీ అన్నాడు.