పదవిలోకొచ్చాను.. సమావేశం నిర్వహిస్తాను: రమేష్ కుమార్
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ఎన్నికల కమిషనర్ పదవిలోకి మళ్లీ వచ్చానని, పరిస్థితులన్నీ చక్కబడ్డాక స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తానని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని ప్రమాణ స్వీకారం చేసిన వారంతా ఆ వ్యవస్థలకు కట్టుబడి వ్యవహరించాలని, సమగ్రతను కాపాడాలని పిలుపునిచ్చారు. వ్యక్తులు శాశ్వతం కాదన్న ఆయన, రాజ్యాంగ సంస్థలు, వాటి విలువలు మాత్రమే చిరస్థాయిగా ఉంటాయని చెప్పారు. గతంలో […]
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ఎన్నికల కమిషనర్ పదవిలోకి మళ్లీ వచ్చానని, పరిస్థితులన్నీ చక్కబడ్డాక స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తానని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని ప్రమాణ స్వీకారం చేసిన వారంతా ఆ వ్యవస్థలకు కట్టుబడి వ్యవహరించాలని, సమగ్రతను కాపాడాలని పిలుపునిచ్చారు. వ్యక్తులు శాశ్వతం కాదన్న ఆయన, రాజ్యాంగ సంస్థలు, వాటి విలువలు మాత్రమే చిరస్థాయిగా ఉంటాయని చెప్పారు. గతంలో మాదిరిగానే తాను ఇకపై కూడా నిష్పక్షికంగా పనిచేస్తానని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పార్టీలతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తానని, పరిస్థితులన్నీ అనుకూలించాక స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలనుకుంటున్నట్లు వెల్లడించారు.