అలా కనిపిస్తే పతివ్రత కాదంటారా? నెటిజన్లను ప్రశ్నించిన హాట్ బ్యూటీ
దిశ, సినిమా: బీ టౌన్ హాట్ బ్యూటీ సోనాలి రౌత్ మోడల్‌గా, ఆర్టిస్ట్‌గా మంచి పేరు సంపాదించుకుంది. అయితే నటనతోనే కాకుండా బోల్డ్ లుక్స్‌తో నెటిజన్లను తనవైపు తిప్పుకున్న నటి.. ఇన్‌స్టాగ్రామ్‌లో 2M పైగా ఫాలోవర్స్‌ను సంపాదించుకోవడం విశేషం. కాగా తాజాగా ఓ ఫొటో షూట్లో పాల్గొన్న భామ.. తన బాడీ గురించి బోల్డ్ కామెంట్స్ చేసి మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. అందమైన శరీరం ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసంతో ప్రదర్శించాలని.. భయం, సిగ్గుతో దాచుకుంటే ప్రశంసలు పొందలేమని […]
దిశ, సినిమా: బీ టౌన్ హాట్ బ్యూటీ సోనాలి రౌత్ మోడల్‌గా, ఆర్టిస్ట్‌గా మంచి పేరు సంపాదించుకుంది. అయితే నటనతోనే కాకుండా బోల్డ్ లుక్స్‌తో నెటిజన్లను తనవైపు తిప్పుకున్న నటి.. ఇన్‌స్టాగ్రామ్‌లో 2M పైగా ఫాలోవర్స్‌ను సంపాదించుకోవడం విశేషం. కాగా తాజాగా ఓ ఫొటో షూట్లో పాల్గొన్న భామ.. తన బాడీ గురించి బోల్డ్ కామెంట్స్ చేసి మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.
అందమైన శరీరం ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసంతో ప్రదర్శించాలని.. భయం, సిగ్గుతో దాచుకుంటే ప్రశంసలు పొందలేమని తెలిపింది. ‘నేను హాట్ పిక్చర్ పోస్ట్ చేసిన ప్రతీసారీ సోషల్ మీడియాలో అవమానానికి గురవుతాను. పతివ్రతలా ప్రవర్తించాలని అంటారు. కానీ నేను ఏమి చేస్తున్నానో నాకు బాగా తెలుసు. ముఖ్యంగా నా చర్మంపై నాకు నమ్మకం ఉంది కాబట్టి ఇవేవీ నన్ను ప్రభావితం చేయవు. అదృష్టవశాత్తు సోషల్ మీడియాలో నాకు వచ్చే 90% కామెంట్స్ సానుకూలంగా ఉంటాయి. అలాంటి వాళ్ల ప్రేమ నాకు ముఖ్యమైనది. ఇక కొంతమంది వ్యక్తులు తమాషాగా చేస్తారో లేదా కావాలనే చేస్తారో తెలియదు కానీ.. చాలా అసభ్యకరమైన సందేశాలను పంపిస్తుంటారు. అవేవీ నా విశ్వాసాన్ని చిన్నాభిన్నం చేయలేవనే విషయం వాళ్లకు తెలియదు పాపం’ అని వివరించింది. (వీడియో కింద ఉంది చూడవచ్చు.)
విడాకులు తీసుకోవడం సమంతకు ఇష్టం లేదా..? ఆ కామెంట్లకు అర్ధం ఏంటి..?