ఇంగ్లాండ్ ఒక్క టెస్టు కూడా గెలవలేదు : గంభీర్

దిశ, స్పోర్ట్స్: టీమిండియాపై ఇంగ్లాండ్ జట్టు ఒక్క టెస్టు మ్యాచ్ కూడా గెలిచే అవకాశం లేదని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఇండియాను స్వదేశంలో ఎదుర్కోవాలంటే బలమైన స్పిన్నర్లు ఉండాలి. అయితే ఇంగ్లాండ్ జట్టులోని మొయిన్ అలీ, డామ్ బెస్, జాక్ లీచ్‌లు ఇంగ్లాండ్ స్పిన్ విభాగాన్ని నడిపించనున్నది. మొయిన్ అలీకి 60 టెస్టుల్లో 181 వికెట్లు తీసిన అనుభవం ఉంది. డామ్ బెస్, జాక్ లీచ్‌లు చెరో 12 టెస్టులు ఆడారు. అయితే ఈ […]

Update: 2021-02-01 09:39 GMT

దిశ, స్పోర్ట్స్: టీమిండియాపై ఇంగ్లాండ్ జట్టు ఒక్క టెస్టు మ్యాచ్ కూడా గెలిచే అవకాశం లేదని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఇండియాను స్వదేశంలో ఎదుర్కోవాలంటే బలమైన స్పిన్నర్లు ఉండాలి. అయితే ఇంగ్లాండ్ జట్టులోని మొయిన్ అలీ, డామ్ బెస్, జాక్ లీచ్‌లు ఇంగ్లాండ్ స్పిన్ విభాగాన్ని నడిపించనున్నది. మొయిన్ అలీకి 60 టెస్టుల్లో 181 వికెట్లు తీసిన అనుభవం ఉంది. డామ్ బెస్, జాక్ లీచ్‌లు చెరో 12 టెస్టులు ఆడారు. అయితే ఈ ముగ్గురు భారత బ్యాట్స్‌మెన్‌లను అడ్డుకుంటారని తాను భావించడం లేదని గంభీర్ అభిప్రాయపడ్డాడు. టీమిండియా 3-0 లేదా 3-1తో సిరీస్ గెలవడం ఖాయం అని గంభీర్ విశ్లేషించాడు. ఇంగ్లాండ్ గెలిచే ఆ టెస్టు పింక్ బాల్ టెస్టు మాత్రమేనని గంభీర్ భావిస్తున్నాడు. శ్రీలంకలో ఇంగ్లాండ్ జట్టు 2-0తో టెస్టు సిరీస్ గెలిచింది. కానీ అక్కడి పరిస్థితులకు ఇండియాలోని పరిస్థితులకు చాలా తేడా ఉంటుంది. టీమిండియాను స్వదేశంలో ఓడించాలంటే చాలా కష్టపడాలి. అందులో ఇటీవల టీమ్ ఇండియా సూపర్ ఫామ్‌లో కూడా ఉందని గంభీర్ అన్నాడు.

Tags:    

Similar News