మరి కొంతకాలం ఆడుంటే గొప్ప ఆల్‌రౌండర్ అయ్యేవాడిని: ఇర్ఫాన్
దిశ, స్పోర్ట్స్: టీమ్‌ఇండియా తరఫున మరికొంత కాలం క్రికెట్ ఆడుంటే గొప్ప ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకునే వాడినని మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. రీడిఫ్ డాట్ కాం వెబ్‌సైట్‌తో ఆయన తన కెరీర్‌కు సంబంధించి పలు విషయాలను పంచుకున్నాడు. ‘తాను ఇండియా తరఫున చివరి మ్యాచ్ 27ఏండ్ల వయసులో ఆడాను. టీం మేనేజ్‌మెంట్ తనకు మరింత ప్రోత్సాహం ఇచ్చుంటే వన్డే క్రికెట్‌లో అంతర్జాతీయంగా గొప్ప ఆల్‌రౌండర్‌ని అయ్యేవాడిని’ అని చెప్పాడు. ప్రస్తుతం చాలా మంది 35ఏండ్ల […]
దిశ, స్పోర్ట్స్: టీమ్‌ఇండియా తరఫున మరికొంత కాలం క్రికెట్ ఆడుంటే గొప్ప ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకునే వాడినని మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. రీడిఫ్ డాట్ కాం వెబ్‌సైట్‌తో ఆయన తన కెరీర్‌కు సంబంధించి పలు విషయాలను పంచుకున్నాడు. ‘తాను ఇండియా తరఫున చివరి మ్యాచ్ 27ఏండ్ల వయసులో ఆడాను. టీం మేనేజ్‌మెంట్ తనకు మరింత ప్రోత్సాహం ఇచ్చుంటే వన్డే క్రికెట్‌లో అంతర్జాతీయంగా గొప్ప ఆల్‌రౌండర్‌ని అయ్యేవాడిని’ అని చెప్పాడు. ప్రస్తుతం చాలా మంది 35ఏండ్ల వయసొచ్చే వరకు ఆడుతున్నారు. కానీ, తాను 27 ఏండ్లకే కెరీర్ ముగించాల్సి వచ్చిందని ఇర్ఫాన్ వాపోయాడు. ఒకవేళ తాను 35ఏండ్ల వరకు టీమ్ ఇండియాలో ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నాడు. కేవలం 59 ఇన్నింగ్స్‌లోనే 100 వికెట్లు తీసి అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన భారతీయ బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత మహ్మద్ షమీ ఆ రికార్డును బద్దలు కొట్టాడు. ఇర్ఫాన్‌లో ప్రతిభను టీం మేనేజ్‌మెంట్ గుర్తించినా తరచూ గాయాలపాలవ్వడం అతని కెరీర్‌ను తీవ్రంగా దెబ్బ తీసింది. 59 మ్యాచ్‌లలో 100 వికెట్లు తీసిని ఇర్ఫాన్ ఆ తర్వాత 61 మ్యాచ్‌లలో కేవలం 73 వికెట్లు మాత్రమే తీయగలిగాడు.