జర్నలిస్ట్ మనోజ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
దిశ, కంటోన్మెంట్: కరోనాతో మృతిచెందిన జర్నలిస్టు మనోజ్‌కుమార్ సంస్మరణ సభను సోమవారం సికింద్రాబాద్ క్లాక్ టవర్ అమరవీరుల స్థూపం వద్ద హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై మనోజ్ కుమార్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బి. బసవ పున్నయ్య మాట్లాడుతూ కరోనాతో మనోజ్‌కుమార్ మృతిచెందడం దురదృష్టకరమన్నారు. మనోజ్ కుటుంబానికి ప్రభుత్వం రూ.25లక్షల […]
దిశ, కంటోన్మెంట్: కరోనాతో మృతిచెందిన జర్నలిస్టు మనోజ్‌కుమార్ సంస్మరణ సభను సోమవారం సికింద్రాబాద్ క్లాక్ టవర్ అమరవీరుల స్థూపం వద్ద హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై మనోజ్ కుమార్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బి. బసవ పున్నయ్య మాట్లాడుతూ కరోనాతో మనోజ్‌కుమార్ మృతిచెందడం దురదృష్టకరమన్నారు. మనోజ్ కుటుంబానికి ప్రభుత్వం రూ.25లక్షల ఎక్స్‌గ్రేసియా చెల్లించి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జర్నలిస్టులు జాగ్త్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు చంద్రశేఖర్, నిరంజన్, విజయానంద్, మధుకర్, రత్నాకర్, శ్రీనివాస్, నరేశ్, సతీశ్, ప్రదీప్, యాదగిరి పాల్గొన్నారు.