మెడికల్ సిబ్బందికి సాయంగా హైదరాబాద్ స్టార్టప్
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ 19 వ్యాధిగ్రస్తులకు చికిత్స చేస్తున్న వైద్య సిబ్బందికి సాయంగా హైదరాబాద్‌కి చెందిన ఒక స్టార్టప్ ఏరోసాల్ బాక్సులను తయారుచేసింది. బటర్‌ఫ్లై ఎడ్యూఫీల్డ్స్‌తో కలిసి టీ వర్క్స్, నిమ్స్ వారు ఈ ఏరోసాల్ బాక్సుల తయారీ ప్రారంభించారు. ఆసుపత్రుల్లో పేషెంట్ల నుంచి వైద్య సిబ్బందికి వైరస్ సోకకుండా ఈ ఏరోసాల్ బాక్సులు ఉపయోగపడతాయి. డాక్టర్లను రిస్కులో పడేసే ఇంట్యుబేషన్ ప్రాసెస్ సమయంలో ఈ ఏరోసాల్ బాక్సులు బాగా అవసరమవుతాయి. డూ ఇట్ యువర్‌సెల్ఫ్ పద్ధతిలో వివిధ […]
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ 19 వ్యాధిగ్రస్తులకు చికిత్స చేస్తున్న వైద్య సిబ్బందికి సాయంగా హైదరాబాద్‌కి చెందిన ఒక స్టార్టప్ ఏరోసాల్ బాక్సులను తయారుచేసింది. బటర్‌ఫ్లై ఎడ్యూఫీల్డ్స్‌తో కలిసి టీ వర్క్స్, నిమ్స్ వారు ఈ ఏరోసాల్ బాక్సుల తయారీ ప్రారంభించారు. ఆసుపత్రుల్లో పేషెంట్ల నుంచి వైద్య సిబ్బందికి వైరస్ సోకకుండా ఈ ఏరోసాల్ బాక్సులు ఉపయోగపడతాయి.
డాక్టర్లను రిస్కులో పడేసే ఇంట్యుబేషన్ ప్రాసెస్ సమయంలో ఈ ఏరోసాల్ బాక్సులు బాగా అవసరమవుతాయి. డూ ఇట్ యువర్‌సెల్ఫ్ పద్ధతిలో వివిధ సైన్సు కిట్లను తయారుచేసే బటర్‌ఫ్లై ఎడ్యుఫీల్డ్స్ సీఈఓ శరత్ చంద్ర ఈ ఏరోసాల్ బాక్సులను తయారుచేయాలని నిమ్స్ వైద్యులు తమ దగ్గరికి వచ్చినట్లు తెలిపారు. తమ సిబ్బందితో కలిసి బాక్సుల తయారీని ప్రారంభించిన తర్వాత లేజర్ కట్టింగ్ పరికరాలు దొరకకపోవడంతో టీ వర్క్స్ కంపెనీ తమకు సాయం చేసినట్లు శరత్ చంద్ర అన్నారు. ఇప్పటివరకు పది ఏరోసాల్ బాక్సులను వైద్యులకు పంపిణీ చేసినట్లు, మరో 100 బాక్సుల తయారీలో ఉన్నట్లు శరత్ చంద్ర వెల్లడించాడు. డిస్పోజబుల్ బాక్సు, రీయూజబుల్ బాక్సు వేరియంట్లలో ఈ ఏరోసాల్ బాక్సులను కంపెనీ తయారుచేస్తోంది. వీటి ధర రూ. 2000 నుంచి రూ. 5000 వరకు నిర్ణయించినట్లు కంపెనీ ప్రకటించింది.
Tags : Aerosol box, Tworks, Intubation process, NIMS, corona, covid 19