విషాదం.. గుండెపోటుతో బౌలర్ ‘అశ్విన్’ మృతి
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ రంజీ జట్టులో విషాద ఘటన చోటుచేసుకుంది. రంజీ జట్టు మాజీ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ అశ్విన్ యాదవ్(33) ఈరోజు గుండెపోటుతో కన్ను మూశాడు. అశ్విన్ యాదవ్.. రంజీ ట్రోఫీలో భాగంగా 2007లో మొహాలీలో పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌ను స్టార్ట్ చేశాడు. ఫస్ట్ క్లాస్ కెరీలో యాదవ్ 14 మ్యాచ్‌లు ఆడి 34 వికెట్లు పడగొట్టాడు. 2008-09 సీజన్‌లో ఉప్పల్ స్టేడియం వేదికగా ఢిల్లీపై 52-6 […]
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ రంజీ జట్టులో విషాద ఘటన చోటుచేసుకుంది. రంజీ జట్టు మాజీ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ అశ్విన్ యాదవ్(33) ఈరోజు గుండెపోటుతో కన్ను మూశాడు. అశ్విన్ యాదవ్.. రంజీ ట్రోఫీలో భాగంగా 2007లో మొహాలీలో పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌ను స్టార్ట్ చేశాడు. ఫస్ట్ క్లాస్ కెరీలో యాదవ్ 14 మ్యాచ్‌లు ఆడి 34 వికెట్లు పడగొట్టాడు.
2008-09 సీజన్‌లో ఉప్పల్ స్టేడియం వేదికగా ఢిల్లీపై 52-6 తన కేరీర్‌లో ఉత్తమ గణాంకాలను నమోదు చేసుకున్నాడు. యాదవ్ చివరి సారిగా 2009లో ముంబైతో తన రంజీ మ్యాచ్ ఆడాడు. అశ్విన్ యాదవ్ మృతిపై భారత ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ సంతాపం వ్యక్తం చేశారు. మాజీ రంజీ ఆఫ్ స్పిన్నర్ విశాల్ శర్మ మాట్లాడుతూ.. అశ్విన్ టీమ్ మ్యాన్ అని అన్నారు. అశ్విన్ ఎల్లప్పుడూ జట్టు విజయం కోసం ఆరాటపడేవాడని తెలిపారు.