‘ట్రీ సిటీ ఆఫ్ ఇండియా’గా హైదరాబాద్: ఇంద్రకరణ్‌రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితిలు హైదరాబాద్ సిటీని ‘ట్రీ సిటీ ఆఫ్ ఇండియా’గా గుర్తించినట్లు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. సోమవారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బాల్క సుమన్, రేఖా శ్యాంనాయక్ హరితహారం కార్యక్రమంపై అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణలో భాగంగా చేపట్టిన వివిధ కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. కంపా నిధుల ద్వారా తరిగిపోయిన సహజ అడవులను పెద్ద ఎత్తున […]
దిశ, తెలంగాణ బ్యూరో: ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితిలు హైదరాబాద్ సిటీని ‘ట్రీ సిటీ ఆఫ్ ఇండియా’గా గుర్తించినట్లు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. సోమవారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బాల్క సుమన్, రేఖా శ్యాంనాయక్ హరితహారం కార్యక్రమంపై అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణలో భాగంగా చేపట్టిన వివిధ కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. కంపా నిధుల ద్వారా తరిగిపోయిన సహజ అడవులను పెద్ద ఎత్తున పునరుజ్జీవించేందుకు అటవీశాఖ చర్యలు తీసుకుంటుందన్నారు.
ఈ క్రమంలో ధ్వంసమైన అటవీ ప్రాంతంలో హరితహారం ద్వారా నాటిన 38.28 కోట్ల మొక్కల ద్వారా అడవుల పునరుద్ధరణ జరిగిందన్నారు. తెలంగాణలో మొత్తం భౌగోళిక విస్తీర్ణం 2.77 కోట్ల ఎకరాలు కాగా, ఇందులో 66.66 లక్షల ఎకరాల విస్తీర్ణంలో అటవీ భూమి ఉందని, మొత్తం తెలంగాణాలో 24.05 శాతం అడవులు ఉన్నాయని తెలిపారు. భారతదేశంలో ఉన్న 21.34 శాతం అడవితో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి కొంత మెరుగ్గానే ఉందని, భౌగోళిక విస్తీర్ణంలో కనీసం 33 శాతం పచ్చదనం ఉండాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ హరితహార కార్యక్రమాన్ని చేపట్టారన్నారు.
రాష్ట్రంలో పచ్చదనం 3.67శాతం పెరిగినట్లు ‘సర్వే ఆఫ్ ఇండియా’ ప్రకటించడం హరితహార కార్యక్రమం ద్వారా సాధించిన విజయమేనని పేర్కొన్నారు. హరితహారం కార్యక్రమం ద్వారా 230 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యం పెట్టుకోగా, ఇప్పటివరకు 217.406 కోట్ల మొక్కలు నాటామని చెప్పారు. గ్రామ పంచాయతీల్లో, మున్సిపాలీటీల్లో మొక్కలు నాటి సంరక్షించేందుకు వార్షిక బడ్జెట్‌లో 10 శాతం హరిత బడ్జెట్‌గా ప్రత్యేకంగా కేటాయిస్తున్నారన్నారు. అటవీ శాఖ, పోలీసులు సమన్వయంగా అటవీ భూములు ఆక్రమణలకు గురవకుండా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.