కోవిడ్ 19 టెస్టింగ్ కిట్ల ఉత్పత్తి .. ఇక హైదరాబాద్ లో

దిశ వెబ్ డెస్క్: కరోనా వైరస్ సోకిందో లేదో తెలుసుకోవడానికి ప్రధానంగా కోవిడ్ 19 టెస్ట్ కిట్స్ ఉపయోగిస్తాం. అందులో భాగంగా ఓ వ్యక్తి గొంతు లేదా ముక్కు నుంచి కఫం నమూనాను తీసుకుంటారు. ఆ నమూనాను ప్రయోగశాలకు పంపి వారిలో వైరస్ లక్షణాలు ఉన్నాయా? లేదా అన్న సంగతిని తెలుసుకుంటారు. అయితే మన దేశంలోనే కాదు చాలా దేశాల్లో కరోనా టెస్టింగ్ కిట్లు అందుబాటులో లేవు. అందుకోసం స్వదేశీ కిట్లు తయారు చేసేందుకు కొన్ని సంస్థలు […]

Update: 2020-04-11 00:31 GMT

దిశ వెబ్ డెస్క్: కరోనా వైరస్ సోకిందో లేదో తెలుసుకోవడానికి ప్రధానంగా కోవిడ్ 19 టెస్ట్ కిట్స్ ఉపయోగిస్తాం. అందులో భాగంగా ఓ వ్యక్తి గొంతు లేదా ముక్కు నుంచి కఫం నమూనాను తీసుకుంటారు. ఆ నమూనాను ప్రయోగశాలకు పంపి వారిలో వైరస్ లక్షణాలు ఉన్నాయా? లేదా అన్న సంగతిని తెలుసుకుంటారు. అయితే మన దేశంలోనే కాదు చాలా దేశాల్లో కరోనా టెస్టింగ్ కిట్లు అందుబాటులో లేవు. అందుకోసం స్వదేశీ కిట్లు తయారు చేసేందుకు కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయి. అలా దేశవ్యాప్తంగా వివిధ సంస్థలు తయారుచేసిన మొత్తం 24 కరోనా టెస్టింగ్ కిట్లలో ఆరింటికి మాత్రమే ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్’(ఐసీఎంఆర్) ఆమోదం లభించింది. ఇందులో హైదరాబాద్ కు చెందిన ‘హువెల్‌ లైఫ్‌ సైన్సెస్‌’రూపొందించిన కిట్‌ కూడా ఉండటం విశేషం.

వాస్తవానికి ఇండియాలో కరోనా టెస్టింగ్ కోసం డిమాండ్ కు తగ్గట్టుగా టెస్టింగ్ కిట్స్ లేవన్నది వాస్తవం. 133 కోట్ల జనాభా ఉన్న ఇండియాలో ఇప్పటివరకూ లక్షకు పైగా శాంపిల్స్ ను మాత్రమే ఐసీఎంఆర్ పరీక్షించింది. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, పోలీసులు, వైద్యాధికారులు చేస్తున్న కృషితో వైరస్ ఇంతవరకూ నియంత్రణలోనే ఉంది. ప్రస్తుతానికి మనం రెండో దశలోనే ఉన్నాం. ఈ దశ దాటితే.. పరిస్థితి చేయి దాటిపోతుందన్నది వాస్తవం. అందువల్ల అనుమానితులతో పాటు.. అందరికీ టెస్టులు చేయాలన్నది సర్కారు ఆలోచన. అయితే.. అందుకోసం టెస్టింగ్ కిట్లు లక్షల్లో అవసరం అవుతాయి. అందుకోసం దేశంలోని ఎన్నో వైద్య ప్రయోగ కేంద్రాల్లో టెస్టింగ్ కిట్లను తయారు చేస్తున్నారు. అమెరికా నేషనల్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఏజెన్సీ, సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) ప్రొటోకాల్‌ను అనుసరించి తయారు చేసిన కిట్లు మాత్రమే ఐసీఎంఆర్ ఆమోదం పొందుతాయి. అలా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు వివిధ సంస్థలు తయారుచేసిన మొత్తం 24 కిట్లలో ఆరింటికి మాత్రమే ఐసీఎంఆర్‌ అనుమతి ఇచ్చింది. ఇందులో హైదరాబాద్‌కు చెందిన ‘హువెల్‌ లైఫ్‌ సైన్సెస్‌’ సంస్థ ఉండటం గొప్ప విషయం. కొవిడ్‌-19తోపాటు సార్స్‌ వంటి ఇతర కరోనా వైరస్‌లను కూడా గుర్తించే విధంగా ఈ కిట్‌ను రూపొందించారు. డిటెక్షన్‌ కిట్‌, ఎక్స్‌ట్రాక్షన్‌ కిట్‌, మాలిక్యులర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మీడియం (ఎంటీఎం), నమూనా సేకరణకు స్వాబ్‌ సహా అన్నీ ఈ కిట్ లోనే ఉంటాయి. ఇందులోని ప్రతి ఒక్క ఎంజైమ్‌నూ హువెల్ సొంతంగా అభివృద్ధి చేయడం విశేషం. ఐసీఎంఆర్ ఆమోదం లభించడంతో.. ఆ సంస్థ రోజుకు 3000-4000 కిట్లను ఉత్పత్తి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దేశంలో ఎక్కడికైనా ఈ కిట్‌లను సరఫరా చేయవచ్చు.

‘డెంగ్యూ, టీబీ, చికున్‌ గున్యా డయాగ్నస్టిక్‌ కిట్‌ల తయారీకి తమకు 2018లో లైసెన్స్‌ లభించిందని, ఇప్పటివరకు దక్షిణ భారతదేశంలోనే తమ కిట్‌లను సరఫరా చేశామని, ఇకపై ఉత్తర భారత మార్కెట్‌పైనా దృష్టిసారిస్తామని’సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ శక్తి నాగప్పన్‌ పేర్కొన్నారు.‘ఇంతవరకు దేశంలో మైల్యాబ్‌, అల్టోనా డయాగ్నస్టిక్స్‌, కిల్‌పెస్ట్‌, సీజిన్‌, ఎస్‌డీ బయోసెన్సార్‌లకు మాత్రమే కిట్‌ల తయారీకి అనుమతి లభించిందని, ఆ జాబితాలో హైదరాబాద్‌కు చెందిన హువెల్‌ లైఫ్‌ సైన్సెస్‌ సంస్థ చేరడం మనకు గర్వకారణమని’ కేటీఆర్‌ ట్వీట్‌చేశారు. ఏపీకీ చెందిన విశాఖ మెడ్ టెక్ జోన్‌లోనూ కోవిడ్ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను తయారు చేస్తున్నారు. కానీ వాటికి ఇంకా ఆమోదం రాలేదు.

అలా ఇక్కడ కూడా:

సౌత్ కొరియాలో సామూహిక కరోనా పరీక్షలను నిర్వహించడంలో ప్రభుత్వం సఫలమైంది. ఇళ్ల వద్దకే వచ్చిన మొబైల్ కియాస్క్ లు ప్రజల ముక్కు నుంచి స్రావాలను స్వీకరించి, పెద్దఎత్తున పరీక్షలు చేశాయి. ఆపై, ఆరు గంటల వ్యవధిలోనే బాధితులకు పరీక్షల ఫలితాలను మెసేజ్ చేశారు. అదే తరహా విధానాన్ని అమలు చేయాలని కూడా మన అధికారులు ఆలోచిస్తున్నారు. మన దేశంలో టెస్టింగ్ కిట్లు ఉత్పత్తి అవుతున్నప్పటికీ చైనా మీద కూడా మనం ఆధారపడ్డాం. అంతేకాకుండా.. మన దగ్గర ఉత్పత్తి అయ్యే వాటికి ఖర్చు కూడా తక్కువ ఉంటుంది. మన రాష్ట్రంలోనే ప్రస్తుతం కిట్ తయారీ కాబోతుండటంతో.. సౌత్ కొరియా ఆలోచనను ఇక్కడ కూడా అమలు చేసే అవకాశం కనిపిస్తోంది.

Tags: corona virus, covid 19 test kit, huwel life science, ktr, icmr

Tags:    

Similar News