తిరుపతిలోనూ హుజురాబాద్ ఉప ఎన్నిక ఊసే.. మంత్రి ఏమన్నారంటే..?

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సోమవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారికి వెండి సాలగ్రామ హారాన్ని సమర్పించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. స్వామి వారి శేష వస్త్రం, తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని మంత్రికి అందించారు. అంతకుముందు వారికి ఆలయం వద్ద టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, […]

Update: 2021-09-12 23:58 GMT

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సోమవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారికి వెండి సాలగ్రామ హారాన్ని సమర్పించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. స్వామి వారి శేష వస్త్రం, తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని మంత్రికి అందించారు.

అంతకుముందు వారికి ఆలయం వద్ద టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడాలని, రెండు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రార్ధించినట్లు వెల్లడించారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందన్నారు.

Tags:    

Similar News