అక్కడ బ్లాస్టింగ్.. ఒకరు అక్కడికక్కడే మృతి

దిశ, హుస్నాబాద్: గౌరవెల్లి ప్రాజెక్టు అండర్ గ్రౌండ్ టన్నల్ పనుల్లో బుధవారం ప్రమాదం చోటుచేసుకుంది. గౌరవెల్లి ప్రాజెక్టుకు 12 కిలోమీటర్ల మేర సొరంగం ఉండడంతో రోజూ లాగే కార్మికులు విధులు నిర్వర్తిస్తుండగా ప్రమాదవశాత్తు బ్లాస్టింగ్ కావడంలో ఒక కార్మికుడు అక్కడికక్కడే మృతిచెందాడు. అంతేగాకుండా మరో మరో ఏడుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన కార్మికులను చికిత్స కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి సొరంగంలో కార్మికులు పలువురు మృతి చెందినట్టు స్థానికులు చెబుతున్నారు. బుధవారం […]

Update: 2020-08-12 06:24 GMT

దిశ, హుస్నాబాద్: గౌరవెల్లి ప్రాజెక్టు అండర్ గ్రౌండ్ టన్నల్ పనుల్లో బుధవారం ప్రమాదం చోటుచేసుకుంది. గౌరవెల్లి ప్రాజెక్టుకు 12 కిలోమీటర్ల మేర సొరంగం ఉండడంతో రోజూ లాగే కార్మికులు విధులు నిర్వర్తిస్తుండగా ప్రమాదవశాత్తు బ్లాస్టింగ్ కావడంలో ఒక కార్మికుడు అక్కడికక్కడే మృతిచెందాడు. అంతేగాకుండా మరో మరో ఏడుగురికి తీవ్రగాయాలు అయ్యాయి.

గాయపడిన కార్మికులను చికిత్స కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి సొరంగంలో కార్మికులు పలువురు మృతి చెందినట్టు స్థానికులు చెబుతున్నారు. బుధవారం ఘటనా స్థలాన్ని స్థానిక హుస్నాబాద్ ఏసీపీ మహేందర్, సీఐ రఘు, ఎస్సై రవి, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పరిశీలించారు.

Tags:    

Similar News