అన్నివైపులా హైదరాబాద్ అభివృద్ధి చెందాలి :కేటీఆర్
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నలువైపులా షాషింగ్ మాల్స్ వచ్చాయని… ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ మారియట్ కన్వెన్షన్ సెంటర్లో ‘‘హుషార్ హైదరాబాద్ విత్ కేటీఆర్’’ పేరిట నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కారణంగా వాణిజ్యంతో పాటు పలు రంగాలు దెబ్బతిన్నాయని అన్నారు. లాక్‌డౌన్ సమయంలో సీఎం సహాయనిధికి అనేక మంది వ్యాపారవేత్తలు విరాళాలిచ్చారని గుర్తు చేశారు. కొన్ని నెలల లాక్‌డౌన్ […]
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నలువైపులా షాషింగ్ మాల్స్ వచ్చాయని… ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ మారియట్ కన్వెన్షన్ సెంటర్లో ‘‘హుషార్ హైదరాబాద్ విత్ కేటీఆర్’’ పేరిట నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కారణంగా వాణిజ్యంతో పాటు పలు రంగాలు దెబ్బతిన్నాయని అన్నారు. లాక్‌డౌన్ సమయంలో సీఎం సహాయనిధికి అనేక మంది వ్యాపారవేత్తలు విరాళాలిచ్చారని గుర్తు చేశారు. కొన్ని నెలల లాక్‌డౌన్ తర్వాత ఆర్థిక వ్యవస్థ క్రమంగా గాడిన పడుతోందని వివరించారు.
గత ఆరేళ్లలో శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం ఎప్పుడూ రాజీపడలేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఎలాంటి హైదరాబాద్ కావాలో పారిశ్రామిక వేత్తలు నిర్ణయించుకోవాలని సూచించారు. అభివృద్ధి హైదరాబాద్ కావాలా.? అరాచకాల హైదరాబాద్ కావాలా.? ప్రజలు ఆలోచించాలన్నారు. టీఎస్ బీ-పాఎస్ ద్వారా భవన నిర్మాణాలకు వేగంగా అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని కేటీఆర్ తెలిపారు.