ఆ ఘటనను మరిచిపోలేని తల్లీకూతుళ్లు.. ఆత్మహత్య!

దిశ, వెబ్‌డెస్క్: ఇంటి పెద్ద దిక్కు మరణంతో భార్య, కూతురు కలత చెందారు. ఏడాది క్రితం కరోనా మిగిల్చిన విషాదాన్ని మరిచిపోలేక తల్లీకూతురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాడిపత్రిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా పుట్టూరు మండలం చింతలపల్లికి చెందిన రామకృష్ణారెడ్డికి కరోనా మొదటి వేవ్ లో పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. చికిత్స పొందుతూనే ఆయన మృతిచెందాడు. అప్పటి నుంచి ఆయన భార్య, కూతురు విషాదంలో మునిగిపోయారు. అక్కడి నుంచి […]

Update: 2021-06-14 02:03 GMT
Mother daughter suicide
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఇంటి పెద్ద దిక్కు మరణంతో భార్య, కూతురు కలత చెందారు. ఏడాది క్రితం కరోనా మిగిల్చిన విషాదాన్ని మరిచిపోలేక తల్లీకూతురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాడిపత్రిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

అనంతపురం జిల్లా పుట్టూరు మండలం చింతలపల్లికి చెందిన రామకృష్ణారెడ్డికి కరోనా మొదటి వేవ్ లో పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. చికిత్స పొందుతూనే ఆయన మృతిచెందాడు. అప్పటి నుంచి ఆయన భార్య, కూతురు విషాదంలో మునిగిపోయారు. అక్కడి నుంచి తాడిపత్రికి వెళ్లొచ్చి కృష్ణాపురం రోడ్డు నంబర్ 16లో నివాసం ఉంటున్నారు.

రామకృష్ణారెడ్డి కూతురు అపర్ణ గూడూరు సచివాలయంలో సర్వేయర్‌గా విధులు నిర్వహిస్తోంది. కాగా, తండ్రి మరణం నుంచి తల్లీకూతురు తీవ్ర మనస్థాపంతోనే గడుపుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News