భార్య ఒడి నుండి మృత్యు ఒడిలోకి..

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలో కరోనా కోరలు చాస్తోంది. రోజూ రోజుకు కేసులు పెరిగిపోవడంతో రోగులు ఆసుపత్రి బయట క్యూ కడుతున్నారు. బెడ్లు కాదు కదా కనీసం ఆక్సిజన్ కూడా దొరకని పరిస్థితి దాపురించింది . తాజాగా ఒక వ్యక్తి ఆక్సిజన్ అందక భార్య ఒడిలోనే కన్నుమూసిన విషాద ఘటన నాసిక్‌ జిల్లా చాంద్వాడ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే చాంద్వాడ్ కు చెందిన అరుణ్ మాలికి కరోనా సోకడంతో అతనిని, అతడి భార్య ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చింది. అక్కడ […]

Update: 2021-04-22 05:21 GMT

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలో కరోనా కోరలు చాస్తోంది. రోజూ రోజుకు కేసులు పెరిగిపోవడంతో రోగులు ఆసుపత్రి బయట క్యూ కడుతున్నారు. బెడ్లు కాదు కదా కనీసం ఆక్సిజన్ కూడా దొరకని పరిస్థితి దాపురించింది . తాజాగా ఒక వ్యక్తి ఆక్సిజన్ అందక భార్య ఒడిలోనే కన్నుమూసిన విషాద ఘటన నాసిక్‌ జిల్లా చాంద్వాడ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే చాంద్వాడ్ కు చెందిన అరుణ్ మాలికి కరోనా సోకడంతో అతనిని, అతడి భార్య ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చింది. అక్కడ బెడ్లు ఖాళీ లేవని, వేరే ఆసుపత్రికి తీసుకెళ్లమని సిబ్బంది చెప్పారు. అరుణ్ పరిస్థితి విషమంగా ఉండడంతో, భార్య బెడ్ ఇవ్వకపోయినా పర్లేదు కొంచెం ఆక్సిజన్ అయినా పెట్టండని వేడుకోంది. దీంతో వైద్య సిబ్బంది ఆక్సిజన్ తెచ్చేలోపు అరుణ్, భార్య ఒడిలోనే కన్నుమూశాడు. కట్టుకున్నవాడు కళ్ళముందే మృతిచెందడంతో ఆ భార్య కన్నీరుమున్నీరయ్యింది. ఈ దృశ్యం చూపరులను కంటతడి పెట్టిస్తోంది.

Tags:    

Similar News