భార్య గొంతు కోసిన భర్త.. ఎందుకంటే

దిశ, వెబ్ డెస్క్ : తరిగొప్పుల మండలం లోని సోలిపూర్ గ్రామానికి చెందిన దండెం నవీన్ అనే వ్యక్తి తన భార్య జ్యోతి గొంతు కత్తితో కోసాడు. అతి కిరాతకంగా రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో చంపేశాడని జ్యోతి తరపు బంధువులు దిశ కి తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే తరిగొప్పుల గ్రామానికి చెందిన జ్యోతికి , సోలిపూర్ గ్రామానికి చెందిన నవీన్ కు 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు , […]

Update: 2021-10-05 00:13 GMT

దిశ, వెబ్ డెస్క్ : తరిగొప్పుల మండలం లోని సోలిపూర్ గ్రామానికి చెందిన దండెం నవీన్ అనే వ్యక్తి తన భార్య జ్యోతి గొంతు కత్తితో కోసాడు. అతి కిరాతకంగా రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో చంపేశాడని జ్యోతి తరపు బంధువులు దిశ కి తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే తరిగొప్పుల గ్రామానికి చెందిన జ్యోతికి , సోలిపూర్ గ్రామానికి చెందిన నవీన్ కు 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు , ఇద్దరు అమ్మాయిలు , ఒక కుమారుడు ఉన్నారు. భార్య భర్తలు కూలీ పనిచేసుకుంటూ పిల్లలను పోషిస్తున్నారు. జ్యోతి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం నిన్న రాత్రి అనగా సోమవారం రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో దాదాపు 12 గంటలకు నవీన్ తన భార్య జ్యోతి గొంతుకను కోసాడని వెంటనే స్థానికులు 108 కి కాల్ చేసి చెప్పగా ,వారు పోలీసులకు సమాచారం అందించారని తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని నిందితున్ని అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలించారు. విషయం తెలుసుకున్న జ్యోతి కుటుంబ సభ్యులు జ్యోతిని చికిత్స నిమిత్తం జనగామ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గ మద్యలోనే ప్రాణాలు కోల్పోయింది. అయితే ఆమె బంధువులు మాత్రం వారి మధ్య ఎలాంటి విభేదాలు, గొడవలు లేవని నవీన్ ఎందుకు ఇలా ఉన్మాదిగా మారాడు అని చర్చించుకుంటున్నారు. నవీన్ ఇలా ఎందుకు ప్రవర్తించాడో, భార్య భర్త ల మధ్య ఏమైనా గొడవ జరిగిందా..? లేక ఇంకా ఏమైనా జరిగిందా..? అనేవి ఇంకా తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News