ముగ్గురు భార్యల కంత్రీ మొగుడు.. ఆ పనికి అడ్డొస్తోందని రెండో భార్యపై క్షుద్రపూజలు
దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లి చేసుకోవడం.. మోజు తీరాక వదిలేయడం అతడి నైజం. ఇప్పటికే ముచ్చటగా ముగ్గురిని వివాహమాడిన ఈ నిత్య పెళ్లి కొడుకు.. కంత్రీ ప్లాన్లు వేయడంలో దిట్ట. మూడో భార్యతో సరసాలకు రెండవ భార్య అడ్డు వస్తోందని.. ఆమెను చేతికి మట్టి అంటకుండా భూతవైద్యుడి సాయంతో అడ్డు తొలగించుకోవాలని ప్రయత్నించాడు. విషయం గ్రహించిన భార్య.. అతగాడిని అడ్డంగా బుక్ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను బాధితులు మీడియాకు […]
దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లి చేసుకోవడం.. మోజు తీరాక వదిలేయడం అతడి నైజం. ఇప్పటికే ముచ్చటగా ముగ్గురిని వివాహమాడిన ఈ నిత్య పెళ్లి కొడుకు.. కంత్రీ ప్లాన్లు వేయడంలో దిట్ట. మూడో భార్యతో సరసాలకు రెండవ భార్య అడ్డు వస్తోందని.. ఆమెను చేతికి మట్టి అంటకుండా భూతవైద్యుడి సాయంతో అడ్డు తొలగించుకోవాలని ప్రయత్నించాడు. విషయం గ్రహించిన భార్య.. అతగాడిని అడ్డంగా బుక్ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను బాధితులు మీడియాకు వివరించింది. ఆమె కథనం ప్రకారం..
పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని శేఖరబంజరకు చెందిన కుమార్ ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈయన కొన్నేళ్ల క్రితం ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు పుట్టిన అనంతరం ఆమెను వదిలేసి గోపిక అనే యువతిని నాలుగేళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెతో కొన్నాళ్లు కాపురం చేసి గోపిక వద్ద ఉన్న బంగారం, డబ్బు మొత్తం తీసుకున్నాడు. ఆమె వద్ద ధనం మొత్తం అయిపోయాక మరో మహిళను మూడో పెళ్లి చేసుకుని సంసారం చేస్తున్నాడు.
మూడో భార్యతో బంధానికి అడ్డుగా వస్తున్న రెండో భార్య గోపికను అడ్డు తొలగించడానికి ప్రణాళిక సిద్ధం చేశాడు. దీంట్లో భాగంగా ఆమెను హతమార్చేందుకు క్షుద్రపూజలు చేయించాడు. దీన్ని గమనించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై క్షుద్రపూజలు చేయిస్తున్నాడని అందుకు సంబంధించిన ఫొటోలను పోలీసులకు అందించింది. భూతవైద్యుడు చిత్రపటం గీసి.. దానిలో తన ఫొటో పెట్టి క్షుద్రపూజలు చేసినట్లు వివరించింది. అయినా పోలీసులు తన ఫిర్యాదును పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించింది. అన్ని సాక్ష్యాలను అందించినా అతడిపై చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. వరుస పెళ్లిళ్లు చేసుకుంటూ అమాయక మహిళలను మోసం చేస్తున్న ఈ నిత్య పెళ్లి కొడుకుపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు సైతం కోరుతున్నారు.