వివాహితకు ఫోన్ కాల్స్.. చితకబాది ట్రాన్స్ ఫార్మర్‌పైకి తోసేసిన భార్యాభర్తలు!

దిశ, వెబ్‌డెస్క్ : పెండ్లయిన మహిళకు గుర్తుతెలియని ఓ యువకుడు తరుచుగా మెసేజెస్, ఫోన్ కాల్స్ చేస్తుండేవాడు. పలుమార్లు మందలించినా అతని ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాకపోవడంతో వివాహిత తన భర్తకు ఈ విషయాన్ని చెప్పింది. దీంతో అతని ఆచూకీ కనుగొన్న భార్యాభర్తలు ఇద్దరూ ఆ యువకుడిపై దాడికి దిగారు. ఈ క్రమంలోనే అతన్ని చితకబాది ట్రాన్స్‌ఫార్మర్ పైకి తోసేసారు. కరెంట్ షాక్ తగిలి తీవ్రగాయాల పాలైన అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ పరిస్థితి విషమించి […]

Update: 2021-07-06 01:32 GMT

దిశ, వెబ్‌డెస్క్ : పెండ్లయిన మహిళకు గుర్తుతెలియని ఓ యువకుడు తరుచుగా మెసేజెస్, ఫోన్ కాల్స్ చేస్తుండేవాడు. పలుమార్లు మందలించినా అతని ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాకపోవడంతో వివాహిత తన భర్తకు ఈ విషయాన్ని చెప్పింది. దీంతో అతని ఆచూకీ కనుగొన్న భార్యాభర్తలు ఇద్దరూ ఆ యువకుడిపై దాడికి దిగారు.

ఈ క్రమంలోనే అతన్ని చితకబాది ట్రాన్స్‌ఫార్మర్ పైకి తోసేసారు. కరెంట్ షాక్ తగిలి తీవ్రగాయాల పాలైన అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఈ దారుణమైన ఘటన వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలోని లింగంపల్లిలో మంగళవారం ఉదయం వెలుగుచూసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతుడి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యా్ప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News