పడవలో ప్రపంచ యాత్ర!
దిశ, ఫీచర్స్: ఏడాది కాలంగా ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేసిన కొవిడ్ మహమ్మారి లక్షలాది మందిని బలితీసుకుంది. కొంతకాలం జనజీవనం పూర్తిగా స్తంభించిపోగా, కరోనా సంక్షోభం అందరికీ ఓ పీడకలను మిగిలిపోయింది. జనాలు ఇప్పుడిప్పుడే ఆ చేదు జ్ఞాపకాల నుంచి బయటపడుతున్నారు. ఈ క్రమంలో హంగేరియన్ కుటుంబం కొవిడ్ భయాలకు, అనిశ్చితికి దూరంగా తమ కలను నెరవేర్చుకునే పనిలో పడ్డారు. 50 అడుగుల పడవలో సముద్రమార్గం గుండా ప్రపంచాన్ని చుట్టేస్తూ లైఫ్‌టైమ్ మెమోరీస్ పోగుచేసుకున్నారు. హంగేరికి చెందిన సాఫ్ట్‌వేర్ […]
దిశ, ఫీచర్స్: ఏడాది కాలంగా ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేసిన కొవిడ్ మహమ్మారి లక్షలాది మందిని బలితీసుకుంది. కొంతకాలం జనజీవనం పూర్తిగా స్తంభించిపోగా, కరోనా సంక్షోభం అందరికీ ఓ పీడకలను మిగిలిపోయింది. జనాలు ఇప్పుడిప్పుడే ఆ చేదు జ్ఞాపకాల నుంచి బయటపడుతున్నారు. ఈ క్రమంలో హంగేరియన్ కుటుంబం కొవిడ్ భయాలకు, అనిశ్చితికి దూరంగా తమ కలను నెరవేర్చుకునే పనిలో పడ్డారు. 50 అడుగుల పడవలో సముద్రమార్గం గుండా ప్రపంచాన్ని చుట్టేస్తూ లైఫ్‌టైమ్ మెమోరీస్ పోగుచేసుకున్నారు.
హంగేరికి చెందిన సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ డొమోంకోస్ బోజ్ తన వర్క్ లైఫ్‌తో పూర్తిగా అలిసిపోయాడు. ప్రతీరోజు వర్క్ ముగించుకుని, ఇంటికొచ్చేసరికి ఆలస్యమవుతుండటం వల్ల పిల్లలతో టైమ్ స్పెండ్ చేయలేకపోయేవాడు. లైఫ్‌లో రిఫ్రెష్‌మెంట్ కోరుకుంటున్న తరుణంలోనే కొవిడ్ లాక్‌డౌన్ తనకో అద్భుత అవకాశం ఇచ్చింది. తన లైఫ్ టైమ్ డ్రీమ్‌ను తీర్చుకోవడానికి అదే సరైన సమయమని భావించిన బోజ్.. ‘టీ టైమ్’ అని పిలుచుకునే పడవలో జూన్, 2020లో క్రొయేషియా పోర్ట్ నుంచి తన కుటుంబంతో కలిసి ప్రపంచయాత్ర మొదలుపెట్టాడు. అక్కడి నుంచి ఇటలీ, స్పెయిన్, కేప్ వెర్డే మీదుగా మార్టినిక్ చేరుకున్నారు. అక్కడే క్రిస్‌మస్ సంబరాలు చేసుకున్న తర్వాత కరేబియన్ ద్వీపమైన సెయింట్ మార్టిన్‌లోని మారిగోట్‌లో కొన్ని రోజులు గడిపి, ఇప్పుడు పనామా కాలువ గుండా మరో దేశాన్ని చుట్టేసే పనిలో ఉన్నారు.
‘నా పిల్లలతో ఎక్కువ సమయం గడపగలిగే అద్భుతమైన అనుభవాన్ని ఈ ప్రయాణం నాకు అందించింది. ఇదో థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ కాగా, పడవలోనే హోమ్ ఆఫీస్ ఏర్పాటు చేసుకుని నా వర్క్‌ను పూర్తి చేస్తున్నాను. వెళ్లే మార్గంలో హరికేన్స్, తుఫానులు ఉన్నాయా? లేవా? ఏ ప్రాంతంలో ఏ సీజన్‌లో వెళ్లకూడదు, ఏ మార్గంలో వెళితే మన ప్రయాణం సేఫ్‌గా ఉంటుందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ముందుకు కొనసాగుతున్నాం. అయినా అట్లాంటిక్ దాటే సమయంలో 6 గంటల పాటు తుఫాన్‌ను ఎదుర్కొన్నాం. దాని ధాటికి శాటిలైట్ ఫోన్ పగిలిపోయింది. ఎప్పటినుంచో ప్రపంచయాత్రకు వెళ్లాలని ప్రణాళిక రచించుకున్నాం. అయితే కొవిడ్ టైమ్‌లో వెళ్లాలా వద్దా? అని సంశయించినా, చివరకు సంకల్పంతో యాత్రకు బయలుదేరాం. ప్రతి దేశంలో అడుగుపెట్టేముందు కరోనా టెస్ట్ చేయించుకోవడంతో పాటు క్వారంటైన్‌లో ఉన్నాం. ప్రతి చోటా నెలకు సరిపడా ఫుడ్ స్టఫ్ తీసుకుంటాం. ఇక సముద్రమార్గంలో ట్యూనా, మహి మహిలతో పాటు ఇతర చేపలను పట్టుకుని తినేవాళ్లం’ అని డొమోంకోస్ బోజ్ అన్నారు.
కొవిడ్ పరిమితుల కారణంగా, వారు ఈ ఏడాది లేదా వచ్చే ఏడాదైనా పసిఫిక్ వైపు ప్రయాణించాలని యోచిస్తున్నారు. తమ యాత్ర మరో 5-6 సంవత్సరాలు కొనసాగవచ్చని, దక్షిణ పసిఫిక్‌తో పాటు ఇండియన్ మహాసముద్రంలో తమ యాత్ర సుదీర్ఘంగా సాగుతుందని తెలిపారు. ఇక వాళ్ల ప్రయాణ విశేషాలను ఎప్పటికప్పుడు ‘సెయిలింగ్ టీటైమ్’ డాట్ కామ్‌లో పంచుకుంటున్నారు.