టీకాతో మనుషులు మొసళ్లవ్వొచ్చు
బ్రెసిలియా: బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో కరోనా వైరస్ టీకాలపై నోరుపారేసుకున్నారు. దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం జరుగుతుందని చెబుతూనే దానిపై భయాలను ప్రేరేపించారు. దేశవ్యాప్తంగా టీకా ఉచితంగా అందిస్తామని, కానీ, టీకా వేసుకోవడం స్వచ్ఛందమేనని స్పష్టం చేశారు. తాను మాత్రం టీకా ఎట్టిపరిస్థితుల్లో వేసుకోనని అన్నారు. ఫైజర్ సహా కరోనా టీకాలు మనుషులను మొసళ్లుగా మార్చవచ్చునని ఆరోపించారు. ‘ఫైజర్ కాంట్రాక్టులో ఇది స్పష్టంగా ఉన్నది. సైడ్ ఎఫెక్ట్‌లకు తమ బాధ్యత లేదని కంపెనీ పేర్కొంది. అంటే […]
బ్రెసిలియా: బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో కరోనా వైరస్ టీకాలపై నోరుపారేసుకున్నారు. దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం జరుగుతుందని చెబుతూనే దానిపై భయాలను ప్రేరేపించారు. దేశవ్యాప్తంగా టీకా ఉచితంగా అందిస్తామని, కానీ, టీకా వేసుకోవడం స్వచ్ఛందమేనని స్పష్టం చేశారు. తాను మాత్రం టీకా ఎట్టిపరిస్థితుల్లో వేసుకోనని అన్నారు. ఫైజర్ సహా కరోనా టీకాలు మనుషులను మొసళ్లుగా మార్చవచ్చునని ఆరోపించారు. ‘ఫైజర్ కాంట్రాక్టులో ఇది స్పష్టంగా ఉన్నది. సైడ్ ఎఫెక్ట్‌లకు తమ బాధ్యత లేదని కంపెనీ పేర్కొంది. అంటే ఒకవేళ టీకా వేసుకున్నాక నువ్వొక మొసలి అయినా వారికి సంబంధం లేదు. నువ్వు సూపర్ హ్యూమన్ అయినా, మహిళలకు గడ్డం పెరిగినా, మగవారి గొంతు మారినా వారికి సంబంధం లేదన్నమాట’ అని అన్నారు.