మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్
దిశ ప్రతినిధి: హైదరాబాద్ ఫిట్స్ తో బాధపడుతున్న ఓ పాలిటెక్నిక్ విద్యార్థిని గుర్తించి సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య చికిత్సలు అందించిన ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ అందరి ప్రశంసలు పొందారు. మెహిదీపట్నంకు చెందిన బి. ఉదయ్ కుమార్ (16) మీర్ పేట్ లోని టీఆర్ఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్నాడు. కాగా మంగళవారం ఇంటికి వెళ్లే క్రమంలో కోఠికి చేరుకున్న అతనికి ఫిట్స్ రావడంతో అక్కడే విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎన్. కృష్ణ గమనించి స్థానికంగా […]
దిశ ప్రతినిధి: హైదరాబాద్ ఫిట్స్ తో బాధపడుతున్న ఓ పాలిటెక్నిక్ విద్యార్థిని గుర్తించి సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య చికిత్సలు అందించిన ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ అందరి ప్రశంసలు పొందారు. మెహిదీపట్నంకు చెందిన బి. ఉదయ్ కుమార్ (16) మీర్ పేట్ లోని టీఆర్ఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్నాడు. కాగా మంగళవారం ఇంటికి వెళ్లే క్రమంలో కోఠికి చేరుకున్న అతనికి ఫిట్స్ రావడంతో అక్కడే విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎన్. కృష్ణ గమనించి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య సేవలు అందించాడు. దీంతో అతను త్వరగా కోలుకున్నాడు. అనంతరం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు హాస్పిటల్‌కు చేరుకుని కుమారునికి వైద్యం అందించిన కానిస్టేబుల్ కృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి, సీఐ సుమన్ కుమార్ లు కానిస్టేబుల్‌ను అభినందించారు.