మంత్రి పర్యటన.. ఆ ఘటనతో భారీ బందోబస్తు…
దిశ, కామారెడ్డి : ఈ నెల 5న గాంధారి మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి వెళ్తున్న సమయంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి కాన్వాయిని బీజేవైఎం నాయకులు అడ్డుకున్న ఘటనతో జిల్లా పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించిన గాంధారి ఎస్సై శంకర్ ను ఎఆర్ హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. తాజాగా గురువారం మాచారెడ్డి మండలం పాల్వంచ మర్రి, చుక్కాపూర్ గ్రామాల్లో […]
దిశ, కామారెడ్డి : ఈ నెల 5న గాంధారి మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి వెళ్తున్న సమయంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి కాన్వాయిని బీజేవైఎం నాయకులు అడ్డుకున్న ఘటనతో జిల్లా పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించిన గాంధారి ఎస్సై శంకర్ ను ఎఆర్ హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. తాజాగా గురువారం మాచారెడ్డి మండలం పాల్వంచ మర్రి, చుక్కాపూర్ గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా 32 కోట్లతో చేపట్టిన బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా పోలీసు శాఖ మంత్రి పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.