భారీగా లాభపడ్డ మార్కెట్!

        గురువారం ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష జరగనున్న నేపథ్యంలో మదుపరులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ సైతం సానుకూల సంకేతాలు ఇస్తుండటంతో సూచీలు లాభాలా బాట పడ్డాయి. ప్రారంభమైన కొద్ది సేపటికే మార్కెట్ భారీ లాభాలతో మొదలైంది. ప్రస్తుతం సెన్సెక్స్ 552 పాయింట్లు లాభపడి 40,424 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 141 పాయింట్ల లాభంతో 11,849 వద్ద ట్రేడవుతోంది. బడ్జెట్ విషయంలో నిరాశ పడ్డ మార్కెట్‌కు అంతర్జాతీయ పరిణామాలు కాస్త ఆదుకున్నాయి. […]

Update: 2020-02-03 23:48 GMT

గురువారం ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష జరగనున్న నేపథ్యంలో మదుపరులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ సైతం సానుకూల సంకేతాలు ఇస్తుండటంతో సూచీలు లాభాలా బాట పడ్డాయి. ప్రారంభమైన కొద్ది సేపటికే మార్కెట్ భారీ లాభాలతో మొదలైంది. ప్రస్తుతం సెన్సెక్స్ 552 పాయింట్లు లాభపడి 40,424 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 141 పాయింట్ల లాభంతో 11,849 వద్ద ట్రేడవుతోంది. బడ్జెట్ విషయంలో నిరాశ పడ్డ మార్కెట్‌కు అంతర్జాతీయ పరిణామాలు కాస్త ఆదుకున్నాయి.

భారతీ ఇన్‌ఫ్రాటెల్, హీరో, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. నెస్లే, బజాజ్, భారతీ ఎయిర్‌టెల్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆటో రంగం మినహాయించి అన్ని రంగాలు లాభాల్లో కదలాడుతున్నాయి. ఉత్పాదక కార్యకలాపాలు ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయికి చేరిన క్రమంలో పెట్టుబడిదారుల సెంటిమెంట్ బలపడిందని మార్కెట్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. రూపాయి సైతం డాలర్ మారకంతో 15 పైసలు లాభపడి 71.21 వద్ద కొనసాగుతోంది.

Tags:    

Similar News