హబూల్ అద్భుతం..బేబీ తార చిత్రాలు అందించినట్లు తెలిపిన నాసా
దిశ వెబ్‌డెస్క్: హబూల్ టెలిస్కోప్ మరోసారి తన విలువను గుర్తు చేసింది. సుదూర తీరాల్లో ఉన్న నక్షత్ర మండలంలో జరుగుతున్న విషయాన్ని క్లిక్ మనిపించింది. తారలు ఎలా ఏర్పడుతున్నాయో తెలిపే చిత్రాలను తీసి అమెరికా స్పేస్ సంస్థ నాసాకు అందించింది. జెమిని స్టెల్లార్‌లో ఓ బేబీ తార రూపొందుతున్న చిత్రాలను హబూల్ గుర్తించి పంపించినట్లు నాసా ప్రకటించింది. దట్టమైన ధూళి, మేఘాల మధ్యలో కొత్తగా ఏర్పడుతున్న ఈ బేబీ తార చిత్రాలు నిజంగా ఓ అద్భుతమంటూ తెలిపింది. […]
దిశ వెబ్‌డెస్క్: హబూల్ టెలిస్కోప్ మరోసారి తన విలువను గుర్తు చేసింది. సుదూర తీరాల్లో ఉన్న నక్షత్ర మండలంలో జరుగుతున్న విషయాన్ని క్లిక్ మనిపించింది. తారలు ఎలా ఏర్పడుతున్నాయో తెలిపే చిత్రాలను తీసి అమెరికా స్పేస్ సంస్థ నాసాకు అందించింది. జెమిని స్టెల్లార్‌లో ఓ బేబీ తార రూపొందుతున్న చిత్రాలను హబూల్ గుర్తించి పంపించినట్లు నాసా ప్రకటించింది.
దట్టమైన ధూళి, మేఘాల మధ్యలో కొత్తగా ఏర్పడుతున్న ఈ బేబీ తార చిత్రాలు నిజంగా ఓ అద్భుతమంటూ తెలిపింది. ప్రస్తుతం దీనికి ఎఫ్‌జీఎల్ 5180 అని నామకరణం చేసింది. ఈ ప్రాంతంలో నక్షత్రాలు ఏర్పడటానికి అవసరమైన గ్యాస్, ధూళి సహ ఇతర సాంద్రత పదార్ధాలు ఉన్నాయని ప్రకటించింది. ఇక్కడ మాతృతార అంటూ ఏదీ లేదని వివరణ ఇచ్చింది. కాంతి ఎక్కువగా ఉండటంతో మొదట బేబీ తారలను గుర్తించటం కష్టమైందని, మెల్లగా తన దిశలను మార్చుకుంటూ హబూల్ బేబీ తార చిత్రాలను తీసిందని తెలిపింది.