రియల్ ఎస్టేట్‌ను సర్కార్ ఆగం చేస్తోంది: కోదండ రామ్

దిశ, ముషీరాబాద్: రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆగం చేస్తోందని తెలంగాణ జన సమితి అధ్యక్షులు ఆచార్య కోదండరాం అన్నారు. దీంతో తెలంగాణలో చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. రిజిస్ట్రేషన్లు వెంటనే మొదలు పెట్టాలని, ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర రియల్టర్స్ అసోసియేషన్, డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆచార్య కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ […]

Update: 2020-12-09 08:18 GMT

దిశ, ముషీరాబాద్: రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆగం చేస్తోందని తెలంగాణ జన సమితి అధ్యక్షులు ఆచార్య కోదండరాం అన్నారు. దీంతో తెలంగాణలో చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. రిజిస్ట్రేషన్లు వెంటనే మొదలు పెట్టాలని, ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర రియల్టర్స్ అసోసియేషన్, డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆచార్య కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ పాల్గొని మద్దతు పలికారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ… ఎల్ఆర్ఎస్ పేరుతో ఎక్కువ ఆదాయాన్ని సంపాదించుకునే ప్లాన్ ప్రభుత్వం వేసిందన్నారు.

చిన్న చిన్న ప్లాట్స్ కొనుక్కున్న మధ్య తరగతి ప్రజలు ఎల్ఆర్ఎస్ కింద వసూలు చేసే డబ్బులు ఎట్లా కడతారని ప్రశ్నించారు. కేసీఆర్‌కు తన ఫామ్ హౌస్ మీద ఎంత హక్కు ఉంటుందో ప్రజలకు వారి ఆస్తులపై అంతే హక్కు ఉంటుందని గుర్తించాలని అన్నారు. ప్రజలు వారి అవసరాలకు అనుగుణంగా భూములు కొనుగోలు చేస్తారని చెప్పారు. ప్రజల ఓట్లతో గెలుపొంది గద్దెనెక్కిన సీఎం కేసీఆర్ ప్రజలకు దూరంగా ఉంటే ఎట్లా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ముందు మాట్లాడే దమ్ము ఏ మంత్రికి లేదని ఎద్దేవా చేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎమర్జెన్సీ సర్వీస్ అని అటువంటి దాన్ని ఎట్లా బంద్ చేస్తారని నిలదీశారు.

Tags:    

Similar News