లాక్ డౌన్ వేళ .. ఇంట్లో ఏం చేయొచ్చు?
దిశ వెబ్ డెస్క్ : మనమందరం పని వేళలకు అలవాటు పడ్డాం. అందరికీ ఓ టైమ్ షెడ్యూల్ ఉంది. ఎంత వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా.. ఇంట్లో టైమ్ గడవదు. చాలామందికి ఇంట్లో ఉండి ఉండి.. బోర్ కలుగుతుంది. కరోనాను తరిమేయాలన్నా.. ఆ మహమ్మారిపై మనమంతా విజయం సాధించాలన్నా.. ఏప్రిల్ 14 వరకు ఇంటి పట్టున ఉండాల్సిందే. మరి ఈ సమయాన్ని మన అభిరుచులకు ఎలా వాడుకోవచ్చు. భారంగా గడుస్తున్న టైమ్ ను… అసలు టైమే తెలియలేదే […]
దిశ వెబ్ డెస్క్ :
మనమందరం పని వేళలకు అలవాటు పడ్డాం. అందరికీ ఓ టైమ్ షెడ్యూల్ ఉంది. ఎంత వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా.. ఇంట్లో టైమ్ గడవదు. చాలామందికి ఇంట్లో ఉండి ఉండి.. బోర్ కలుగుతుంది. కరోనాను తరిమేయాలన్నా.. ఆ మహమ్మారిపై మనమంతా విజయం సాధించాలన్నా.. ఏప్రిల్ 14 వరకు ఇంటి పట్టున ఉండాల్సిందే. మరి ఈ సమయాన్ని మన అభిరుచులకు ఎలా వాడుకోవచ్చు. భారంగా గడుస్తున్న టైమ్ ను… అసలు టైమే తెలియలేదే .. రోజు ఇట్టే గడిచిపోయిందని మనం ఆశ్చర్యపోయేలా మార్చుకోవచ్చు. ఎలా అంటారా?
ఆఫీసు హడావిడిలో పడి.. ఇల్లును పట్టించుకోవడానికి టైమ్ కేటాయించం. ఈ వీకెండ్…ఎలాగైనా సరే.. ఇంటిని క్లీన్ చేసి.. అందంగా అలంకరించాలి అని మనలో చాలా మంది అనుకుంటారు. కానీ దానికంటే మరో ముఖ్యమైన పని ఉండగానే… ఆ పనిని కాస్త వాయిదా వేస్తాం. సో ఇంటిని అందంగా డెకరేట్ చేసుకోవాలన్న ఆలోచన పెండింగ్‌లో ఉంటే ఆ పని ఇప్పుడు చేపట్టిండి. ఇంటిని అందంగా ఎలా డెకరేట్ చేయాలో తెలిపే.. బోలెడు వీడియోలు యూ ట్యూట్ లో ఉన్నాయి. మనకు నచ్చినట్లు మన ఇంటిని అలంకరించుకోవడానికి ఇదే అనువైన సమయం.
ఫోటోగ్రఫీ నేర్చుకోవచ్చు :
చాలా మందికి ఫొటోగ్రఫీ అంటే ఇష్టం ఉంటుంది. కానీ రోజు వారీ పనులు వల్ల మన ఇష్టంపై అంతగా ఫోకస్ పెట్టం. ఇప్పుడు ఖాళీ సమయం చిక్కింది. ఎక్కడికి వెల్లేందుకు కూడా వీలు లేదు. వెంటనే కెమెరాకు పని చెప్పండి. ఆన్లైన్ లో ఫోటోగ్రఫీ మెలకువలు ఉచితంగా నేర్పించే చానల్ లు ఉన్నాయి. ఫోటోగ్రఫీ కోర్సులు కూడా నేర్పుతారు. ఇంతకన్నా మంచి తరుణం మించిన మనకు రాదు. ఎంచక్కా మన ఆసక్తికి మెరుగులు దిద్దుకోవచ్చు.
తోటపనితో ఆనందం :
గార్డెనింగ్ చేయడమంటే చాలా మందికి ఇష్టం. మన ఇంటి చుట్టూ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ .. గార్డెనింగ్ చేయొచ్చు. అపార్ట్మెంట్ లో ఉన్న బాల్కనీలో మొక్కలను పెంచుకోవచ్చు. కాస్త స్థలముంటే ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. మిద్దె వ్యవసాయం ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు. దీనికి సంబంధించిన సమాచారం నెట్ లో దొరుకుతుంది. ఎలా చేయాలో చెబుతూ.. చాలా మంది యూ ట్యూబ్లో వీడియోలు పెట్టారు. అంతేకాదు … కాగితంతో , పాత ప్లాస్టిక్ బాటిళ్లతో, సీడీలతో పువ్వులు ఎలా చేయొచ్చో తెలిపే వీడియోలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. మొక్కలు పెంచేందుకు ప్లాస్టిక్ బాటిళ్లను, పాత టైర్లను ఎలా ఉపయోగించుకోవచ్చు కూడా నెట్ లో చూసి నేర్చుకోవచ్చు.
అలనాటి ఆటలు :
ఆడటానికి సెల్ ఫోన్, బోర్డ్ గేమ్స్ మాత్రమే ఉన్నాయా? అవుట్ డోర్ గేమ్స్ మించిన ఇండోర్ గేమ్స్ ఎన్నో ఉన్నాయి. ఇంట్లోనే ఆడుకునే మన పాత తరం ఆటలను ఈ తరానికి నేర్పించవచ్చు. అష్టాచెమ్మా, పైలా పచ్చీస్, కైలాసం (పాము-నిచ్చెన), గచ్చకాయలు, పులి – మేక, పుల్లాట, అంత్యాక్షరీ, వామన గుంతలు, క్యారమ్స్, చెస్ దాగుడు మూతలు ఇలా ఎన్నో ఆటలు ఉన్నాయి. వీటితో పాటు రూబిక్ క్యూబ్ సాల్వింగ్, సుడోకు.. ఫజిల్స్ వంటివి ఆడితే టైమే తెలియదు. బ్యాడ్మింటన్ కూడా ఆడోచ్చు.
కథలతో కాలక్షేపం
ఇప్పుడంటే… ఎక్కడ చూసిన చిన్న కుటుంబాలు కనిపిస్తున్నాయి. కానీ ఒకప్పుడు .. ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అత్తమ్మలు, మామయ్యలు, పిన్ని, బాబాయ్ లు,
అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు ఇలా ఇంటినిండా మందే. రాత్రి వేళల్లో… అందరూ చేరి పిల్లలకు కథలు చెప్పేవారు. కానీ ఇప్పుడు అంతా తీరిక ఎవరికీ ఉంది. అందుకే ఈ సయమంలో పిల్లలకు ఆనాటి చందమామ కథలను చెప్పండి. నీతి కథల సారాన్ని బోధించండి. జీవితంలో ఎదురైన అనుభవాలను, ఎదుర్కొన్న కష్టాలను వారితో పంచుకోండి. ఓటమి ఎదురైతే… ఎలా బయటపడాలో.. వివరించి చెప్పండి. కరోనా కాలాన్ని సంపూర్ణంగా పిల్లలతో గడపండి.
మనసైన వారితో మాట్లాడితే.. :
ఉద్యోగం, ఇంటి బాధ్యతలతో, ఇతర పనులతో … ఇలా మనం ఎప్పుడూ బిజీనే. మనకు నచ్చిన వారితో మాట్లాడాలని ఎన్నో సార్లు అనుకుంటాం. కానీ అంత తీరిక చేసుకోం.. నెలల తరబడి వాయిదా వేస్తుంటాం. ‘క్వారెంటైన్’ కావాల్సిన వాళ్లతో మాట్లాడే క్వాలిటీ టైమ్ ఇచ్చింది. అలా పోస్ట్ పోన్ చేస్తున్న .. లేదా చాలా కాలం మాట్లాడకుండా ఉన్నా.. బంధు-మిత్రులు, పాత స్నేహితులతో ఒక్కసారి మాట్లాడి చూడండి, వీలైతే వారితో వీడియో చాట్ పెట్టుకోండి. ఆపాత మధుర సంఘటనలన్నీ ఒక్కసారి గుర్తు చేసుకోండి. మనసు తేలిక పడుతుంది. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. నెగెటివ్ ఆలోచనలు అస్సలు రావు.
నచ్చిన వారికి మెచ్చిన వంట :
వంటకాలు తినడం ఎంత బాగా ఉంటుందో…. వంట వండి పెడితే.. అంతకన్నా బాగుంటుంది. చాలా మందికి వంటలు చేయడం రాదు. కరోనా కాలంలో.. కిచెన్ ను ప్రయోగశాలగా మార్చండి. ఇన్స్టంట్ గా చేసే వంటకాలను ఇట్టే నేర్చుకోవచ్చు. మన వంట పద్దతులను చిన్నారులకు పరిచయం చేయండి. ఏ దినుసులు ఎందుకు వాడుతారో.. వాటి విశిష్టత ఏంటో.. వాటిని తీసుకోవడం వల్ల శరీరానికి కలిగే లాభాలేంటో.. పిల్లలకు చెప్పండి. కొందరికీ వంటల్లో ప్రయోగాలు చేయడం ఇష్టం. యూట్యూబ్ లో పాకశాస్త్రానికి సంబంధించి వేలాది వీడియోలున్నాయి. మనం గరిటే పట్టడమే ఆలస్యం.
ఆపాద మధురాలు :
ఆతరం నుంచి ఈతరం వరకు అందరకీ సినిమాలంటే ఎంతో అభిమానం. కుటుంబంలో తమకు ఇష్టమైన సినిమాలను లిస్టుగా రాసుకుని అందరూ కలిసి చూడండి. ఆ సినిమా ఎందుకు ఇష్టం. ఆ సినిమాలోని గొప్పతనం ఏంటో డిస్కస్ చేయండి. పెద్దలు ఆనాటి పాత మధురాలను ఈనాటి తరానికి చూపించండి . మనసుకు నచ్చిన పాటలను వినండి. లలితమైన సంగీతాన్ని వింటే… మనసు కూడా ఎంతో తేలిక పడుతుంది.
పుస్తక పఠనం :
పుస్తకాలు చదివడం వల్ల వ్యక్తిత్వ వికాసం పెంపొందుతుంది. అందుకే చాలా మంది పుస్తకాలు చదవాలని సూచిస్తుంటారు. చందమామ కథల నుంచి పడితే.. . ఫిక్షన్, నాన్ ఫిక్షన్, కామిక్స్, నవలలు, ఇలా ఏదైనా చదవచ్చు. జీవిత చరిత్రలు కూడా చాలా బాగుంటాయి. పుస్తకాలు కొనాల్సిన అవసరం కూడా లేదు. ఆన్‌లైన్‌లో అయినా చదవడానికి ట్రై చేయొచ్చు.
ఇంకాం ఏమేం చేయొచ్చు?
ఇతర భాషలను నేర్చుకోవచ్చు. నెట్ లో చాలా మంది ఇతర భాషలు ఎలా నేర్చుకోవచ్చు పాఠాలు చెబుతారు.
పెయింటింగ్ మీద ఆసక్తి ఉంటే దానిపై ఇప్పడు దృష్టిసారించవచ్చు
యోగా, మెడిటేషన్ చేయొచ్చు. వ్యాయామం ఆరోగ్యానికి ఎంతో మంచిది. రోజు ఒక అరగంట చేసినా చాలు.
సంగీత సాధన చేయొచ్చు. సంగీత పరికరాలు వీణ, వయోలిన్, గిటార్, తబలా నేర్చుకోవాలని ఉంటే ఇదే అనువైన సమయం. యూ ట్యూబ్ లో ఎన్నో ట్యూటోరియల్స్ అందుబాటులో ఉన్నాయి.
Tags: :book reading , quarantine, lock down, movies, songs, stories, family, exersise, yoga, meditation,