మీ కొడుకు అర్జున్ సినిమాల్లోకి వస్తాడా అని అడిగిన బాలయ్య.. వెంకీ మామ ఏమ‌న్నాడంటే..?

నందమూరి బాలకృష్ణ(Balakrishna) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో ‘అన్‌స్టాపబుల్’(Unstoppable). ఆహా(Aha)లో స్ట్రీమింగ్ అయ్యే ఈ షో ఇప్పటికే మూడు సీజన్లు కంప్లీట్ చేసుకోగా.. ప్రస్తుతం నాలుగో సీజన్ కూడా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.

Update: 2024-12-27 04:56 GMT

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ(Balakrishna) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో ‘అన్‌స్టాపబుల్’(Unstoppable). ఆహా(Aha)లో స్ట్రీమింగ్ అయ్యే ఈ షో ఇప్పటికే మూడు సీజన్లు కంప్లీట్ చేసుకోగా.. ప్రస్తుతం నాలుగో సీజన్ కూడా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇక ఇప్పటికీ ఆరు ఏపిసోడ్స్ పూర్తి చేసుకున్న అన్‌స్టాపబుల్ షోకి తాజాగా విక్టరి వెంకటేష్(Victory Venkatesh) వచ్చారు. ఇతనితో పాటు వెంకీ మామ బ్రదర్ దగ్గుబాటి సురేష్ బాబు(Daggubati Suresh Babu) అండ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కూడా పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ప్రోమో(Promo)ను తాజాగా రిలీజ్ చేయగా.. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో బాలయ్య.. వెంకటేష్ కొడుకు అర్జున్ గురించి ఓ ప్రశ్న అడిగారు. దీనికి వెంకీ స్పందిస్తూ.. ‘ప్రస్తుతం నా కొడుకు అర్జున్‌ వయసు 20 సంవత్సరాలు. ప్రజెంట్ అతను అమెరికాలో చదువుకుంటున్నాడు. బేసిక్‌గా అర్జున్ చాలా నిదానం’ అని వెంకీ చెప్పుకొచ్చాడు. ఇక అర్జున్ సినిమాల్లోకి రానున్నాడా ఇంకా తన కొడుకు గురించి వెంకటేష్ ఏమని చెప్పాడో తెలుసుకోవాలంటే ఫుల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

Tags:    

Similar News