పెరుగు ఫేస్‌ప్యాక్ తయారు చేసుకొండిలా..!
చర్మ సౌందర్యం కోసం చాలామంది ఎంతో డబ్బును వృధా చేస్తుంటారు. అలా కాకుండా మన ఇంట్లో అందుబాటులో ఉండే పెరుగుతో ఫేస్ ప్యాక్ లు తయారు చేసుకోవచ్చు. పెరుగు తినడానికి మాత్రమే కాదు.. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో ఎంతో ఉపయోగపడుతోంది. పెరుగులో ఉండే విటమిన్ సి, ల్యాక్టిక్ యాసిడ్, క్యాల్షియం వంటితో చర్మం అందంగా, ఫ్రెష్ గా కనబడుతోంది. ఇప్పుడు పెరుగు ఫేస్ ప్యాక్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.. ఒక కప్పులో రెండు టేబుల్ […]
చర్మ సౌందర్యం కోసం చాలామంది ఎంతో డబ్బును వృధా చేస్తుంటారు. అలా కాకుండా మన ఇంట్లో అందుబాటులో ఉండే పెరుగుతో ఫేస్ ప్యాక్ లు తయారు చేసుకోవచ్చు. పెరుగు తినడానికి మాత్రమే కాదు.. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో ఎంతో ఉపయోగపడుతోంది. పెరుగులో ఉండే విటమిన్ సి, ల్యాక్టిక్ యాసిడ్, క్యాల్షియం వంటితో చర్మం అందంగా, ఫ్రెష్ గా కనబడుతోంది. ఇప్పుడు పెరుగు ఫేస్ ప్యాక్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..
ఒక కప్పులో రెండు టేబుల్ స్పూన్ల పుల్లని పెరుగు తీసుకుని బాగా గిలకొట్టాలి. వీటిలో మాష్ చేసిన అరటిపండు, రెండు టీ స్పూన్ల రోజ్ వాటర్ ను వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ చుట్టూ అప్లై చేసుకోవాలి. ఇది ఆరిన తర్వాత చల్లటి నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటే ముఖం కాంతివంతంగా తయారవుతోంది.
ఒకవేళ జిడ్డు చర్మం ఉన్నట్లయితే రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, ఒక టేబుల్ స్పూన్ తేనె, నిమ్మరసం ఒక టీస్పూన్ తీసుకుని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ చుట్టూ ప్యాక్‌లా అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈ రెండు పెరుగు ఫేస్ ప్యాక్‌లను వారంలో రెండు సార్లు చేస్తే.. ముఖంపై ఉండే మచ్చలను తగ్గించడమే కాకుండా చర్మం అందంగా కనిపిస్తోంది. ఇంట్లో ఒకసారి మీరు ట్రై చేయండి