అద్దె ఇల్లు సొంతం కావాలంటే ఇలా చేయండి..!
దిశ, వెబ్‌డెస్క్: ఒకే ఇంట్లోనే ఏండ్లుగా ఉంటూ, ఎక్కువ కాలం అద్దె కడుతుంటే.. ఆ ఇల్లు మన సొంతమవుతుందని అంటుంటారు. మరి అది నిజమేనా..? ఎన్ని సంవత్సరాల పాటు అలా ఓ ఇంట్లో అద్దె కడుతూ ఉండొచ్చు.? అలా ఉంటే ఆ ఇంటిపై హక్కు ఉంటుందా.? అయితే దాని గురించి పూర్తి వివరాలు మీ కోసం సొంతిళ్లు అనేది ముఖ్యంగా మధ్య తరగతి, పేదల కల. ఆ కల అందరికి నెరవేరకపోవచ్చు. అందుకే సొంతిళ్లు లేని వాళ్ళు […]
దిశ, వెబ్‌డెస్క్: ఒకే ఇంట్లోనే ఏండ్లుగా ఉంటూ, ఎక్కువ కాలం అద్దె కడుతుంటే.. ఆ ఇల్లు మన సొంతమవుతుందని అంటుంటారు. మరి అది నిజమేనా..? ఎన్ని సంవత్సరాల పాటు అలా ఓ ఇంట్లో అద్దె కడుతూ ఉండొచ్చు.? అలా ఉంటే ఆ ఇంటిపై హక్కు ఉంటుందా.? అయితే దాని గురించి పూర్తి వివరాలు మీ కోసం
సొంతిళ్లు అనేది ముఖ్యంగా మధ్య తరగతి, పేదల కల. ఆ కల అందరికి నెరవేరకపోవచ్చు. అందుకే సొంతిళ్లు లేని వాళ్ళు అద్దె ఇంట్లొ ఉంటారు. కొంతమంది తరుచూ తాము అద్దెకు ఉండే ఇంటిని మారుస్తూ ఉంటారు. ఇంకొంత మంది ఒకే ఇంట్లో ఏళ్ళ తరబడి ఉంటారు. అలా ఏళ్ళ తరబడి ఆ ఇంట్లో ఉంటే అది వాళ్ళ సొంతమవుతుందా అంటే కొన్ని నియమాలు ఉన్నాయి. చట్టంలో దాని గురించి అన్ని వివరాలు పేర్కొన్నారు.
చట్టంలో పేర్కొన్న అంశాలు మీ కోసం..
చట్ట ప్రకారం ఎవరైనా 12 సంవత్సరాల పాటు ఒకే ఇంట్లో అద్దెకు ఉంటూ, సమయానికి అద్దె కడుతూ ఉంటున్నట్లయితే ఆ ఆస్తిపై హక్కు పొందుతారు. అది కూడా అమ్మేందుకు కాదు నివాసం ఉండడానికి మాత్రమే. యజమానికి చెందిన ఎలాంటి ఆస్తిని అద్దెదారుడు తనదిగా క్లెయిమ్ చేయలేడు. ఉదాహరణకు ఒక వ్యక్తి ఏదైనా ఇంట్లో అద్దె కడుతూ నివాసం ఉంటూ అతడు 12 సంవత్సరాలకు పైగా నివసిస్తున్నట్లయితే, అతడు ఆ ఆస్తిపై హక్కు పొందినట్లే. ఇంటి ఓనర్ ప్రమేయం లేకుండా ఆ ఇంటికి ఎలాంటి మరమత్తులు, లేదా రెనోవేషన్ చేయించకపోతే ఆ వ్యక్తి అద్దె కడుతూ జీవితాంతం ఆ ఇంట్లోనే ఉండొచ్చు దీనిని అడ్వాన్స్ పోసిషన్ అని న్యాయ నిపుణులు అంటారు.
12 సంవత్సరాల కంటే ఎక్కువగా ఒకే ఇంట్లో ఉన్నవారిని అడ్వర్స్ టెనెంట్ అని అంటారు. ప్రాపర్టీ ట్యాక్స్ కడుతూ.. ఆ రశీదుపై తన పేరు కలిగి ఉంటే దీనికి సేల్ డీడ్‌తో సంబంధం లేకుండా ఖచ్చితంగా ఓనర్ షిప్ హక్కులకు ఆ వ్యక్తి అర్హుడు. కానీ 12 సంవత్సరాల పాటు ఆ వ్యక్తి ఆ ఇంట్లో ఉంటూ.. దాని ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్, కరెంట్ బిల్లులు కడుతుంటే.. ఆ బిల్లులపై మాత్రం ఓనర్ పేరు ఉంటే.. అద్దెకు ఉంటున్న వ్యక్తికి ఆ ఇల్లు సొంతం అవ్వదు. కేవలం అద్దెదారుడిగా ఆ వ్యక్తి జీవితాంతం ఆ ఇంట్లో ఉండొచ్చు. అతన్ని ఖాళీ చేయించలేరు.