మార్కెట్లో ఫేక్ ఎన్95 మాస్క్‌లు
దిశ, ఫీచర్స్ : కొవిడ్ సెకండ్ వేవ్ ఉద్ధృతంగా వ్యాప్తిస్తూ.. జనాలను కలవరపెడుతోంది. ఆ మహమ్మారి వల్ల ప్రాణాలు విడుస్తున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. కరోనా కల్లోలం తీవ్రంగా ఉన్నా, మరోసారి లాక్డౌన్ చేసే పరిస్థితి లేదని ప్రభుత్వం తెగేసి చెబుతోంది. ఈ పరిస్థితుల్లో స్వీయరక్షణే శ్రీరామరక్షగా భావించి, అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే కొవిడ్ నిబంధనలను తప్పక పాటించాలి. ఇతరుల నుంచే కాకుండా, గాలి ద్వారా కూడా కరోనా వచ్చే అవకాశం […]
దిశ, ఫీచర్స్ : కొవిడ్ సెకండ్ వేవ్ ఉద్ధృతంగా వ్యాప్తిస్తూ.. జనాలను కలవరపెడుతోంది. ఆ మహమ్మారి వల్ల ప్రాణాలు విడుస్తున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. కరోనా కల్లోలం తీవ్రంగా ఉన్నా, మరోసారి లాక్డౌన్ చేసే పరిస్థితి లేదని ప్రభుత్వం తెగేసి చెబుతోంది. ఈ పరిస్థితుల్లో స్వీయరక్షణే శ్రీరామరక్షగా భావించి, అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే కొవిడ్ నిబంధనలను తప్పక పాటించాలి. ఇతరుల నుంచే కాకుండా, గాలి ద్వారా కూడా కరోనా వచ్చే అవకాశం ఉన్నందున మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. ఆ మాస్క్ మూడు లేయర్లుగా ఉండాలి లేదంటే డబుల్ మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో చాలామంది ఎన్95 మాస్క్‌లు వాడుతున్నారు. అయితే ఈ పరిస్థితిని క్యాష్ చేసుకోవడానికి కొందరు మార్కెట్లోకి ఫేక్ ‘ఎన్95’ మాస్క్‌లను తీసుకొచ్చారు. మరి వీటిని(ఫేక్ ఎన్95 మాస్క్‌లను) గుర్తించడం ఎలా?
‘గాలిలోని డ్రాప్‌లెట్స్‌తో పాటు 0.3 మైక్రాన్ల కన్నా పెద్ద కణాలు ప్రవేశించకుండా నిరోధించాలంటే N95 మాస్క్‌ల వాడకమే శ్రేయస్కరం. ఈ విషయంలో 95 శాతం సమర్థంగా పనిచేస్తాయి’ అని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ భౌతిక శాస్త్రవేత్త అర్నాబ్ భట్టాచార్య వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే మార్కెట్లో మాత్రం ఎన్95 పేరుతో నకిలీ మాస్క్‌లను అమ్ముతున్నారు. ఆ మాస్క్‌లు 0.3 మైక్రాన్ కణాలను 50 – 60 శాతం మాత్రమే ఫిల్టర్ చేయగలవు. దీని అర్థం సూక్ష్మ కణాలను ఫిల్టర్ చేయగల సామర్థ్యం ఉన్నప్పటికీ.. అవి వైరస్, బ్యాక్టీరియాలను ఫిల్టర్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉండవు. దీంతో ఈ మాస్క్ పెట్టుకున్నా ప్రయోజనం ఉండదని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మాస్క్ తయారీదారులు చాలామంది N95 మాస్క్‌ల విషయంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. రీయూజబుల్ మాస్క్‌లను కూడా N95 అని చెబుతున్నారని భట్టాచార్య పేర్కొన్నాడు. ఈ మాస్క్‌లు చిన్న కణాలను ట్రాప్ చేసే ఎలెక్ట్రోస్టాటిక్ చార్జ్‌ను ఉపయోగిస్తుండటం వల్ల అవి అంత సమర్థవంతంగా పనిచేయవు, వాటిని కడగడం వల్ల ఆ చార్జ్ పూర్తిగా తొలగిపోతుంది, వాటిని మరింత తక్కువ ప్రభావవంతం చేస్తుంది అని ఆయన అన్నాడు. ఫేక్ మాస్క్ గుర్తించే విషయంలో ఆ మాస్క్ ప్యాకింగ్‌పై ఫిల్టరింగ్ ఫేస్పీస్ రెస్పిరేటర్ (ఎఫ్ఎఫ్ఆర్) గుర్తులు ఉండవు. హెడ్బ్యాండ్పై (TC) సంఖ్య ఉండదు. NIOSH పేరు ఉండకపోవడం లేదా పేరు తప్పుగా ముద్రిస్తారు. హెడ్ బ్యాండ్స్ బదులు ఇయర్ లూప్స్ ఉండొచ్చని ఆయన వెల్లడించారు.