ఇవి తిను.. ఇమ్యూనిటీ పవర్ పెరుగు

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ (కోవిడ్19) భయంతో జనాలు వణికిపోతున్నారు. చికిత్స కంటే నివారణ మేలు అన్న చందంగా ప్రజలు వ్యక్తిగత శుభ్రతతోపాటు ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తున్నారు. ప్రభుత్వాలు పలు నివారణాచర్యలు తీసుకుంటున్నాయి. భారత్‌లో ఇప్పటికే పలు రాష్ట్రాలు ఈ నెల 31 వరకు లాక్‌డౌన్ ప్రకటించాయి. కరోనా మహమ్మారి సోకిన వారిలో వ్యాధినిరోధక శక్తి అధికంగా ఉంటే వారు త్వరగా కోలుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఎటువంటి ఆహార పదర్థాలు […]

Update: 2020-03-24 02:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ (కోవిడ్19) భయంతో జనాలు వణికిపోతున్నారు. చికిత్స కంటే నివారణ మేలు అన్న చందంగా ప్రజలు వ్యక్తిగత శుభ్రతతోపాటు ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తున్నారు. ప్రభుత్వాలు పలు నివారణాచర్యలు తీసుకుంటున్నాయి.
భారత్‌లో ఇప్పటికే పలు రాష్ట్రాలు ఈ నెల 31 వరకు లాక్‌డౌన్ ప్రకటించాయి. కరోనా మహమ్మారి సోకిన వారిలో వ్యాధినిరోధక శక్తి అధికంగా ఉంటే వారు త్వరగా కోలుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఎటువంటి ఆహార పదర్థాలు తీసుకోవాలి..

ఏవి తీసుకుంటే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందనే అంశాలపై ‘దిశ’ కథనమిది…

ఇమ్యూనిటీ పవర్‌కు చిట్కాలు…

– పరగడపున నాలుగేసి తులసి ఆకులు తింటూ ఉండాలి.
– నల్ల జీలకర్ర, బొప్పాయి, క్యారట్‌, తేనె, ఏలకులు, తాటి బెల్లం, నల్ల ద్రాక్ష, నక్షత్రపు సోంపు, ఉల్లి, వెల్లుల్లి,
– వేసవి సీజన్‌లో లభ్యమయ్యే కాయగూరలు, పండ్లను అధికంగా తీసుకోవచ్చు.
– రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే ప్రమాదకరం. అందుచేత ఆపిల్, బొప్పాయి, అనాసపండు, అరటి పండు,
– ఖర్జూరం, మామిడి, దానిమ్మ, జామపండు, నారింజ, బెండకాయలు, కీర దోసకాయ, చెరకు రసం,
కొబ్బరి బోండాం వంటివి క్రమం తప్పకుండా తీసుకుంటూ వుండాలి.
– స్ట్రాబెర్రీ, పెద్ద ఉసిరి, జామ, ఆరంజ్‌, మునగాకు, గెనిసి గడ్డలు, ఆహార వంటల్లో రీఫైండ్‌ ఆయిల్‌ కన్నా కొబ్బరి నూనె వాడటం ఉత్తమం.
– వెల్లుల్లిని పాలలో కలుసుకొని రాత్రి వేళల్లో తాగితే వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది.
– ఇంకా షాపుల్లో అమ్మే కూల్ డ్రింక్స్ తీసుకోకండి. వీటికి బదులు ఫ్రెష్ జ్యూస్‌లను తీసుకోవాలి.
కూల్ డ్రింక్స్ తీసుకోవడం ద్వారా నిరోధక శక్తి తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tags: Human Immunity Power, carona virus (Covid-19), improve

సపోటా వల్ల ప్రయోజనాలు

Tags:    

Similar News